రుణాలకు బ్రేక్‌ | Loans Are Stopped Because Of Election Code | Sakshi
Sakshi News home page

రుణాలకు బ్రేక్‌

Published Thu, Nov 15 2018 5:38 PM | Last Updated on Thu, Nov 15 2018 5:38 PM

Loans Are Stopped Because Of Election Code - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: స్వయం ఉపాధి పథకంలో నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు. రుణాల పంపిణీ ప్రారంభమైనట్లే అయి ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. కార్పొరేషన్‌ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్‌ అడ్డుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలు  అందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు 2వేల మందికిపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం     – మిగతా 2లోu
ఆదిలాబాద్‌రూరల్‌: స్వయం ఉపాధి పథకంలో నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు. రుణాల పంపిణీ ప్రారంభమైనట్లే అయి ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. కార్పొరేషన్‌ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్‌ అడ్డుగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలు  అందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు 2వేల మందికిపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం వివిధ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు.
 
అందని ద్రాక్షే.. 
బీసీ కార్పొరేషన్‌ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పాడిన నాలుగున్నరేళ్లలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. మొదటగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికి రూ.లక్ష రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీని మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమా చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మొదట ఏప్రిల్‌ 4 వరకు గడువు విధించింది. చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఏప్రిల్‌ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులను స్వీకరించారు. 2011 జనాభా లెక్కాల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్‌ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు గుర్తించారు. 

750 మందికి పంపిణీ.. 
జిల్లాలో కార్పొరేషన్‌ ద్వారా 15,800 లబ్ధిదారులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేటగిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరీ –3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేలు వంద శాతం సబ్సిడీపై చెక్కులు పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి రూ.50 వేల యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇంతలోనే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుండడంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో సబ్సిడీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. మళ్లీ వచ్చే ప్రభుత్వం ఎప్పుడు రుణాలను అందజేస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. 
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ..
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందు నుంచి ఎస్సీ కార్పొరేషన్‌లో వివిధ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో దరఖాస్తుల స్వీకరణ గడువును మూడు సార్లు పెంచారు. ఇప్పటి వరకు ఆయా రుణాల కోసం 6,566 దరఖాస్తులు వచ్చిన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి వారికి ఎన్నికలు ముగిసేంత వరకు రుణాలు అంద డం కష్టంగానే ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఐటీడీఏ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ గిరిజనులకు అందజేసే రుణాలకు సంబంధించి దరఖాస్తులను కూడా స్వీకరించలేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 
కొనసాగుతున్న గొర్రెల పంపిణీ..
సబ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అయినందున వాటికి ఎన్నికల కోడ్‌ వర్తిం చదని తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏ గ్రూప్‌ లో 4,282 మందికి పంపిణీ చేయగా, బీ గ్రూప్‌లోని 4,267 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో 39 మత్స్య సహకార సంఘాలు ఉండగా ఇందులో 2,500 మంది సభ్యులు ఉన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయితీ వాహనాల పంపిణీ కొనసాగించనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొం టున్నారు. జిల్లాలో ద్విచక్ర వాహనాలకు 1146 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు వెయ్యి మంది లబ్ధిదారులు వారి వాటాను చెల్లించారని వీరిలో ఇప్పటికి 300 ద్విచక్ర వాహనాలు, 20 లగేజీ వాహనాలు సైతం పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా వారికి త్వరలో వాహనాలు సరఫరా కానున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
 

రుణం కోసం ఎదురు చూస్తున్నా
నేను లాండ్రి షాప్‌ను కొన్నేళ్ల నుంచి నడుపుతున్నాను. బీసీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో రూ.లక్ష యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. రుణం మంజూరైనా ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. ఇబ్బందులు తప్పడం లేదు.– చెక్కల రమేష్, లాండసాంగ్వి, ఆదిలాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement