Sheep scheme
-
గొర్రెల స్కాం.. పశుసంవర్ధక శాఖ సీఈవో రాంచందర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గొర్రెల స్కాములో విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా పలు కీలక అరెస్ట్‌లు చేపట్టింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న సీఈవో రాంచందర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అలాగే ఎస్ఓడీ కల్యాణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.2.10 కోట్ల స్కామ్‌లో రామ్‌చందర్, కళ్యాణ్‌కుమార్ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిని రేపు కోర్టులో హాజరుపర్చారు.స్కీంను.. స్కాంగా మార్చిన వైనంపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. వెటర్నరీ శాఖలో ఉన్నతాధికారులను విచారిస్తున్నారు. స్కిం కాస్ట్ పెంచడం, దళారుల పాత్రపై కీలక సమాచారం రాబట్టారు అధికారు. ఎవరు అధికారిగా ఉన్నప్పుడు స్కిం కాస్ట్ పెంచారో అనే విషయంపై ఆరా తీస్తున్నారు. త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. . -
గొర్రెల కుంభకోణంలో నలుగురు అరెస్ట్
-
గొర్రెలు నచ్చలే..!
డొంకేశ్వర్(ఆర్మూర్): గొర్రెల కోసం ఏపీలోని అనంతపూర్‌కు వెళ్లిన జిల్లా అధికారులకు, లబ్ధిదారులకు చుక్కెదురైంది. అక్కడ మందలు మందకొడిగానే ఉండడంతో లబ్ధిదారులకు జీవాలు నచ్చలేదు. దీంతో బోధన్ నుంచి 18 మంది, పల్లికొండ నుంచి 16మంది మూడ్రోజుల పాటు అక్కడే ఉండి జిల్లాకు వాపస్ వచ్చారు. అనుకున్న స్థాయిలో గొర్రెలు లేకపోవడం, కొన్నిచోట్ల పెద్దగా ఉండడంతో కొనుగోలు సాధ్యపడలేదు. దీంతో జిల్లాలో జీవాల పంపిణీకి స్వల్ప బ్రేకులు పడ్డాయి. లబ్ధిదారులను మళ్లీ తీసుకెళ్లడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మందలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల కోసం అన్వేషిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 9న గొర్రెల పంపిణీని ప్రారంభించారు. అయితే, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీవాల పంపిణీ జిల్లాలో 85 యూనిట్లకే పరిమితమైంది. ఇటీవల అనంతపూర్ జిల్లాకు వెళ్లిన అధికారులు ఆపసోపాలు పడి ఇప్పటి వరకు జిల్లాకు 1,785 జీవాలను మాత్రమే తెచ్చారు. వాస్తవానికి పంపిణీ ప్రారంభం రోజున 24 యూనిట్ల చొప్పున ఐదు నియోజకవర్గాలు కలిపి మొత్తం 120 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలి. కానీ, జీవాలను పక్క రాష్ట్రం నుంచి తెచ్చేందుకు సమయం సరిపోకపోవడంతో 85 యూనిట్లే పంపిణీ చేశారు. ఇంకా 35 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. దీనికోసం ఇటీవల అనంతపూర్‌కు వెళ్లగా, అక్కడి గొర్రెలు లబ్ధిదారులకు నచ్చలేదు. దీంతో మిగిలిన యూనిట్ల గ్రౌండింగ్ దశాబ్ది ఉత్సవాల్లో సాధ్యపడలేదు. డీడీలు కట్టిన వారిని తీసుకెళ్తాం గొర్రెలు నచ్చక అనంతపూర్ నుంచి కొంతమంది వాపస్ వచ్చిన విషయం వాస్తవమే. వారిని మళ్లీ తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 120లో ఇంకా 35 యూనిట్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. డీడీలు కట్టిన మిగతా వారందరినీ కూడా జీవాలను తెచ్చేకునేందుకు తీసుకెళ్తాం. లబ్ధిదారులు అందోళన చెందకుండా ఒపిక పట్టాలి. – జగన్నాథచారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మిగతా వారికి ఎప్పుడో? రెండో విడత గొర్రెల పంపిణికీ ప్రభుత్వం జిల్లాకు 8,384 యూనిట్ల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇప్పటి వరకు 1,843 మంది గొల్ల, కుర్మలు తమ వాటాధనాన్ని ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించారు. ప్రస్తుతం 85 మందికి మాత్రమే యూనిట్లు అందడంతో మిగతా వారు మాకెప్పుడిస్తారని అధికారులను అడుగుతున్నారు. తమను కూడా జీవాలను తెచ్చుకునేందుకు తీసుకెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే, గొర్రెలను జిల్లాకు తేవడానికి కలెక్టర్ నియమించిన జిల్లా అధికారులు ఇటీవల అనంతపూర్కి వెళ్లారు. మళ్లీ తెచ్చేందుకు వారినే పంపుతారా? లేదా రాష్ట్ర శాఖ సూచించిన అధికారులు వెళ్లారా..? అనే స్పష్టత రావాల్సి ఉంది. అనంతపూర్‌తో పాటు కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి జీవాలను తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, రాయచూర్‌కు ఇంత వరకు జిల్లా నుంచి వెళ్లలేదు. -
గొర్రెలొద్దు.. డబ్బులు కావాలి
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద తమకు గొర్రెలు వద్దని, నగదు బదిలీ చేస్తే లబ్ధిదారుడికి అనుకూలంగా ఉన్న చోట గొర్రెలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో నగదు బదిలీ తీర్మానాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు మాట్లాడిన అనంతరం చర్చా వేదిక ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చర్చా వేదికలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందారులకు 1లక్ష 75 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచాలని, ఈ పథకం కింద నగద బదిలీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం అమలులో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇకనైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య -
గొర్రెల పథకంలో అవకతవకలు: ఈటల
సాక్షి, వరంగల్: గొల్ల కురుమలకోసం రూ.8వేల కోట్లు గొర్రెల పథకం కింద ఖర్చుపెట్టారని, ఇందులో అనేక అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాదీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీ కూడా గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై మాట్లాడటం లేదన్నారు. గొల్లకురుమలకు రూ.31,500 వాటాధనం కడితే ఒక్కో యూనిట్ కింద రూ.1.25 లక్షలు గొర్రెలు ఇచ్చారని, గొర్రెలను సాదుకోలేక రూ.55 వేలకు అమ్ముకుంటే వారికి మిగిలింది రూ.13 వేలనుంచి రూ.18 వేల వరకే అన్నారు. మిగతా డబ్బులు ఎవరి పాలయ్యాయో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా, కేవలం హుజూరాబాద్‌లో ఒక్క ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేసి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దళితబంధు దళితులపై ప్రేమతో కాదని, వారి ఓట్లను కొల్లగొట్టేందుకేనని ఈటల ఆరోపించారు. చదవండి: 50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి -
దేశానికే ఆదర్శం ‘గొర్రెల’ పథకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం దేశానికే ఆదర్శమని, ఇలాంటి పథకాన్ని కర్ణాటకలో కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కర్ణాటక గొర్రెలు–మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ సీవీ లోకేశ్‌గౌడ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు–మేకల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకం తీరుతెన్నులను అధ్యయనానికి గురువారం లోకేశ్‌గౌడ రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ గొర్రెలు–మేకల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఎండీ డాక్టర్ వి.లక్ష్మారెడ్డి, సంస్థ అధికారులతో లోక్‌శ్‌గౌడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలుచేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం లక్ష్యం, నిధుల వినియోగం, లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల సేకరణ, పథకం అమలుతీరు,వివరాలను వి.లక్ష్మారెడ్డి లోకేశ్‌గౌడకు వివరించారు. అనంతరం లోకేశ్‌గౌడ విలేకరులతో మాట్లాడుతూ... సబ్సిడీ ద్వారా యాదవ, కురుమ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయంలో నష్టాల వల్ల దేశ వ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ కోలార్ జిల్లాలో ముగ్గురే ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రధాన కారణం పాడిపశువుల పెంపకమే నని తెలిపారు. మాంసం దిగుబడి మరింత పెరిగేలా మేలుజాతి రకాలను దిగుమతి చేసుకోవాలని లోకేశ్‌గౌడ సూచించారు. ఆ రకాలను అందించేందుకు కర్ణాటక సిద్ధంగా ఉందని చెప్పారు. మేకపాలతో మంచి లాభాలు... మాంసం దిగుబడితో పాటు మేక పాల సేకరణపై దృష్టి సారిస్తే మంచి లాభాలను సాధించవచ్చని లోకేశ్‌గౌడ సూచించారు. దేశంలోని ప్రధాన నగరాలలో మేక పాలకు మంచి డిమాండ్ ఉందని, ఔషధ గుణాలు ఉండటంతో లీటరు మేకపాలు రూ.2,000 వరకు ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గొర్రెలు–మేకల పెంపకం దారుల పిల్లలకు 6 నుంచి 12 తరగతి వరకు ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆర్థికసాయం అందించే ‘బేడ్ పాలక్ యోజన’ పథకాన్ని ఇటీవల నిలిపివేసిందని, దీన్ని పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించాలని ఆయన సూచించారు. -
రుణాలకు బ్రేక్
ఆదిలాబాద్‌రూరల్: స్వయం ఉపాధి పథకంలో నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు. రుణాల పంపిణీ ప్రారంభమైనట్లే అయి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. కార్పొరేషన్ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలు అందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు 2వేల మందికిపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం – మిగతా 2లోu ఆదిలాబాద్‌రూరల్: స్వయం ఉపాధి పథకంలో నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు. రుణాల పంపిణీ ప్రారంభమైనట్లే అయి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. కార్పొరేషన్ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలు అందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు 2వేల మందికిపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం వివిధ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. అందని ద్రాక్షే.. బీసీ కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పాడిన నాలుగున్నరేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. మొదటగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికి రూ.లక్ష రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీని మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమా చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ఏప్రిల్ 4 వరకు గడువు విధించింది. చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులను స్వీకరించారు. 2011 జనాభా లెక్కాల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు గుర్తించారు. 750 మందికి పంపిణీ.. జిల్లాలో కార్పొరేషన్ ద్వారా 15,800 లబ్ధిదారులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేటగిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరీ –3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేలు వంద శాతం సబ్సిడీపై చెక్కులు పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి రూ.50 వేల యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇంతలోనే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుండడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సబ్సిడీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. మళ్లీ వచ్చే ప్రభుత్వం ఎప్పుడు రుణాలను అందజేస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి ఎస్సీ కార్పొరేషన్లో వివిధ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తుల స్వీకరణ గడువును మూడు సార్లు పెంచారు. ఇప్పటి వరకు ఆయా రుణాల కోసం 6,566 దరఖాస్తులు వచ్చిన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి వారికి ఎన్నికలు ముగిసేంత వరకు రుణాలు అంద డం కష్టంగానే ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఐటీడీఏ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ గిరిజనులకు అందజేసే రుణాలకు సంబంధించి దరఖాస్తులను కూడా స్వీకరించలేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొనసాగుతున్న గొర్రెల పంపిణీ.. సబ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అయినందున వాటికి ఎన్నికల కోడ్ వర్తిం చదని తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏ గ్రూప్ లో 4,282 మందికి పంపిణీ చేయగా, బీ గ్రూప్‌లోని 4,267 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో 39 మత్స్య సహకార సంఘాలు ఉండగా ఇందులో 2,500 మంది సభ్యులు ఉన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయితీ వాహనాల పంపిణీ కొనసాగించనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొం టున్నారు. జిల్లాలో ద్విచక్ర వాహనాలకు 1146 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు వెయ్యి మంది లబ్ధిదారులు వారి వాటాను చెల్లించారని వీరిలో ఇప్పటికి 300 ద్విచక్ర వాహనాలు, 20 లగేజీ వాహనాలు సైతం పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా వారికి త్వరలో వాహనాలు సరఫరా కానున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రుణం కోసం ఎదురు చూస్తున్నా నేను లాండ్రి షాప్‌ను కొన్నేళ్ల నుంచి నడుపుతున్నాను. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో రూ.లక్ష యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. రుణం మంజూరైనా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. ఇబ్బందులు తప్పడం లేదు.– చెక్కల రమేష్, లాండసాంగ్వి, ఆదిలాబాద్ -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కులవృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించాలనేది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం సచివాలయంలోని అన్ని జిల్లాల గొర్రెల పెంపకందారుల సొసైటీల డైరెక్టర్లు, సభ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.5 వేల కోట్ల ఖర్చు తో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్న కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు మార్చిలో పెద్దఎత్తున గొల్ల, కురుమల బహిరంగసభను హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గొల్ల, కురుమల సంక్షేమ భవన నిర్మాణం కోసం రాజేంద్రనగర్ వద్ద 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. ఇందులో సంక్షేమ భవనం, హాస్టల్‌ను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. రైతులు తమ భూముల్లో గడ్డి పెంపకం చేపట్టేందుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలకు పాలు విక్రయిస్తున్న రైతులకు 50 శాతం సబ్సిడీపై పాడి గేదెలను పంపిణీ చేసేందుకు ప్రభు త్వం సుమారు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గొర్రెల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మేత సరఫరాకు రెండు కమిటీలు.. గొర్రెల మేతను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కమిటీలను నియమించింది. మేత సరఫరా కోసం సాంకేతిక కమిటీ టెండర్ ప్రక్రియను నిర్వహించాలని, ఆర్థిక కమిటీ, సాంకేతిక కమిటీ నిర్ణయాలను పరిశీలించి అమలు చేయాలని సూచించింది. యాదవులంతా ఐక్యంగా ఉండాలి...మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హైదరాబాద్: యాదవులంతా ఐక్యంగా ఉండి సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం హైదరాబాద్ నాగోలులోని శుభం కన్వెన్షన్ సెంటర్లో యాదవ, గొర్రెల కాపరుల సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ యాదవులు, గొర్రెలకాపరుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిం దన్నారు. సీఎం చేపడుతున్న సంక్షేమ పథకాలతో గొల్ల, కురుమలు ఎంతో సం తోషంగా ఉన్నారని, త్వరలోనే గేదెల పంపిణీ ఉంటుందని, ఒక్కో గేదెకు రూ.80 వేలు ఖర్చు పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఫిష్ ఫెడరేషన్ చైర్మన్ రాజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్, కృష్ణ యాదవ్, గొర్రెలకాపరుల, యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆంధ్రా దళారులకు వరం.. గొర్రెల పథకం
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి జగిత్యాల అగ్రికల్చర్: యాదవులకు ప్రభు త్వం ఇస్తున్న సబ్సిడీ గొర్రెల పథకం ఆంధ్రా దళారులకు వరంగా మారిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల మండలం ధర్మా రంలో యాదవులకు గురువారం ఆయన సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. ఆంధ్రా దళారులు మన రాష్ట్రంలో గొర్రెను రూ.4 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని, వాటిని మన గొల్లకుర్మలకు రూ. 6 వేల నుంచి రూ.7 వేలకు అంటగడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు ఆంధ్రోళ్లే అడ్డంకి అని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు గొర్రెల రూపేణా ఆంధ్రా దళారులకే లాభం చేస్తోందని ఎద్దేవా చేశారు. వర్షాకా లంలో పశువులకు గాలికుంటు టీకాలు వేయాలని సీఎం, పశుసంవర్ధకశాఖ మంత్రి, వెటర్నరీ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. -
ఓ ఎలమందా..అందేనా గొర్రెల మంద!
► గొర్రెల పథకంలో అడుగడుగునా ఇబ్బందులే పొరుగు రాష్ట్రాల్లోనే జీవాలకు కొరత మరి 82 లక్షల గొర్రెలను రాష్ట్రానికి తెచ్చేదెలా? రంగంలోకి దిగిన దళారులు.. బోగస్ సభ్యత్వాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 లక్షల యాదవ, కుర్మ కుటుంబాలు lఇప్పటికే 5.70 లక్షలకుపైగా దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్ రెండేళ్లలో 82 లక్షల గొర్రెల పంపిణీ..! రాష్ట్రంలో యాదవ, కుర్మల కోసం గొర్రెల పథకం కింద ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యమిది. మరి అంత పెద్ద మొత్తంలో గొర్రెలు కొనుగోలు చేయటం సాధ్యమేనా..? అసలు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అంత పెద్ద సంఖ్యలో గొర్రెలు అందుబాటులో ఉన్నాయా..? దూరప్రాంతంలో వాటిని కొంటే రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు తడిసి మోపెడు కావా? ఒక్కసారిగా లక్షల సంఖ్యలో కొంటే డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరిగిపోవా? ఈ పథకంలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకం ఆరంభ దశలోనే సర్కారుకు క్షేత్రస్థాయిలో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గొర్రెల సంపదలో రెండో స్థానం దేశంలోనే గొర్రెలు అత్యధికంగా ఉన్న రెండో రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 1.78 కోట్ల మేకలు, గొర్రెలున్నట్లుగా పశు సంవర్థక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో 1.23 కోట్ల గొర్రెలున్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. గొర్రెల సంపదలో దేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో, ఏపీ మూడో స్థానంలో, కర్ణాటక నాలుగో స్థానంలో ఉన్నాయి. తక్కువ గొర్రెలున్న రాష్ట్రాలు ఎక్కువ గొర్రెలున్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయటం మార్కెట్ సూత్రం. కానీ.. ఇప్పటికే అత్యధిక గొర్రెలున్న తెలంగాణ ఒక్కసారిగా 41 లక్షల చొప్పున వరుసగా రెండేళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఎంచుకోవటం గమనార్హం. పొరుగు రాష్ట్రాల్లోనే కొరత రాష్ట్రానికి సరిపడే గొర్రెలు పొరుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులో లేవు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ప్రకారం 43 వేల యూనిట్లు అవసరం. అంటే దాదాపు 8.60 లక్షల గొర్రెలు. వీటిని కర్ణాటక నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ కర్ణాటకలో రెండు జిల్లాల్లో కేవలం 9 లక్షల గొర్రెలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో అమ్మకానికి, అంగట్లోకి వచ్చేవి 2 లక్షలకు మించే పరిస్థితి లేదు. అదే విషయాన్ని ఇటీవల అక్కడి గొర్రెల పెంపకందారులు జిల్లా నుంచి వెళ్లిన బృందాలకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన యూనిట్లను పంపిణీ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దళారుల దందా.. ఒక్కో గొర్రెల యూనిట్‌కు రూ.1.25 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 25 శాతం రూ.3,1250 లబ్ధిదారుడు తన వాటాగా చెల్లిస్తే.. మిగతా 75 శాతం(రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కానీ రవాణా ఖర్చుల పేరిట దరఖాస్తుదారుల నుంచి అడ్డగోలు వసూళ్ల పర్వం మొదలైంది. ఇప్పటికే దళారులు సైతం ఈ పథకంలో రంగప్రవేశం చేశారు. ఇటీవల బాధితులు స్వయంగా ఓ మంత్రికి మొరపెట్టుకోవటం గమనార్హం. అంచనాకు మించి డిమాండ్ గొర్రెల యూనిట్లకు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ సర్కారుకు దడ పుట్టిస్తోంది. ముందుగా ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 4 లక్షల యాదవ, కుర్మ కుటుంబాలున్నాయి. ఈ ఏడాది రెండు లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల కుటుంబాలకు యూనిట్ల పంపిణీ లక్ష్యంగా ఎంచుకుంది. 18 ఏళ్లు నిండి.. సొసైటీల్లో సభ్యులైన వారందరినీ అర్హులుగా ప్రకటించింది. లాటరీ పద్ధతిలో ఈ ఏడాది సగం మందికి, వచ్చే ఏడాది మిగతా వారికి యూనిట్ల పంపిణీకి సిద్ధపడింది. కానీ కుటుంబంలో అర్హుల సంఖ్యపై సీలింగ్ లేకపోవటం, పలు చోట్ల బోగస్ సభ్యులు నమోదు కావడంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. గత నెల(మే) 10 నాటికే గొర్రెల ఫెడరేషన్‌కు 5.70 లక్షల మంది దరఖాస్తు చేశారు. దీంతో ఈ సంఖ్య 6.50 లక్షలకు చేరుతుందని అధికారుల అంచనా . ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు వంతున అందరికీ యూనిట్లు పంపిణీ చేయాలంటే 1.30 కోట్ల గొర్రెలు అవసరం కానున్నాయి. రవాణాకు ఒక్కో యూనిట్‌కు రూ.2,000 మన రాష్ట్రంలో ఉన్న గొర్రెలు కొనుగోలు చేస్తే రీసైక్లింగ్ పేరిట అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు సర్కారు నడుం బిగించింది. కానీ దూరాభారంతో రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాకు కర్ణాటకలోని దావణగెరే, చిత్రదుర్గ్ నుంచి గొర్రెలు కొనాలని నిర్ణయించారు. ఈ జిల్లాకు దావణగెరే 645 కి.మీ.ల దూరం. చిత్రదుర్గ్ 575 కి.మీ.ల దూరం. 250 గొర్రెలు రవాణా చేసే వ్యాన్లు కి.మీకు రూ.35 చొప్పున రేటు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన పది యూనిట్ల గొర్రెలను తెచ్చేందుకు రూ.23 వేల ఖర్చవుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. సిరిసిల్ల జిల్లాకు నెల్లూరు, కడప జిల్లాల నుంచి, నిజామాబాద్ జిల్లాకు అనంతపురం నుంచి గొర్రెలు తీసుకు రావాలని నిర్ణయించారు. దూరాల్లో స్వల్ప తేడాలున్నా ఒక్కో యూనిట్‌కు సగటున రూ.2 వేల చొప్పున రవాణాకే ఖర్చవుతోంది. అంటే ఈ ఏడాది పంపిణీ చేసే రెండు లక్షల యూనిట్లకు రూ.40 కోట్లు రవాణాభారం తప్పని పరిస్థితి నెలకొంది. కొండెక్కిన గొర్రె ధర రాష్ట్ర ప్రభుత్వం భారీగా గొర్రెలు కొనుగోలు చేస్తుందనే ప్రచారంతో పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గొర్రెల ధరలు కొండెక్కాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.4 వేలకు లభ్యమైన గొర్రెలను ఇప్పుడు అమాంతం రూ.6 వేలకు పెంచేశారు. యూనిట్ల పంపిణీ సమయం దగ్గరపడుతుండటంతో ఈ రేటు మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. -
కాళేశ్వరంలో కాల్వలే ముందు
బ్యారేజీ, పంప్‌హౌస్‌లు పూర్తయ్యేలోగా కాల్వలు నిర్మించాలి - అందుకు ప్రత్యేక చొరవ చూపండి: ఎమ్మెల్యేలకు సీఎం సూచన - దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించండి - భగీరథ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి - గ్రేటర్ వరంగల్ గ్రామాలకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో కాల్వల నిర్మాణం, మరమ్మతులపై ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయ్యేలోగా కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని, ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకంలో లేక ఫీడర్ చానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని చెప్పారు. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏ పనులు అవసరమో గుర్తించి, వాటిని అధికారులతో చేయించాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక ప్రాజెక్టులు కడుతున్నామని, వాటి ద్వారా నీరందించాల్సింది కాల్వలే కాబట్టి అవి ముందుగా సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. బ్యారేజీల నిర్మాణం కన్నా ముందే పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలున్నాయని, కాబట్టి కాల్వలు సిద్ధంగా ఉంటే చెరువులు నింపుకోవచ్చని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమ య్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, పువ్వాడ అజయ్, స్టీఫెన్ సన్, సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రేఖా నాయక్, బాబురావు రాథోడ్, సాయన్న, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ ఇందులో పాల్గొన్నారు. ‘భగీరథ’పై దృష్టి పెట్టండి తమ నియోజకవర్గాల పరిధిలో మిషన్ భగీరథ పనులపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నియోజకవర్గానికి నీళ్లందించే ఇన్‌టేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, పైప్లైన్ల నిర్మాణ పురోగతి? తదితర అంశాలను గమనించాలన్నారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటే పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని, గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సూచించారు. ఆ 42 గ్రామాలకూ గొర్రెల పథకం గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన 42 గ్రామాల్లో కూడా గొర్రెల పంపిణీ పథకంలో యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, వరంగల్ నగర పరిధిలో చేరిన గ్రామాలు అవకాశం కోల్పోయాయని ఆ జిల్లా మేయర్ నన్నపునేని నరేందర్ ముఖ్యమంత్రిని కలసి విన్నవించారు. ఈ గ్రామాల్లో యాదవులు, కుర్మలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వ పథకంలో వారినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం విలీన గ్రామాల్లోని యాదవులు, కుర్మలను సొసైటీల్లో చేర్పించి, పథకం వర్తింప చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని ఆదేశించారు. జూన్‌లో రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలో ఎస్టీ బాలికలకు ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్లు నడపాలని కోరారు. ఈ మేరకు వెంటనే తుది జాబితా రూపొందిం చాలని చందూలాల్‌ను ఆదేశించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ రాష్ట్ర అవతరణ వేడుకలు, పెండింగ్ సమస్యలపై చర్చ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో అరగంటసేపు చర్చలు జరిపారు. జూన్ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లు, రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి కేంద్ర హోం శాఖ స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీతో పాటు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇటీవల రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలపైనా తెలంగాణ వాదనలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది.