సాక్షి, హైదరాబాద్: గొర్రెల స్కాములో విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా పలు కీలక అరెస్ట్‌లు చేపట్టింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న సీఈవో రాంచందర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అలాగే ఎస్‌ఓడీ కల్యాణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.2.10 కోట్ల స్కామ్‌లో రామ్‌చందర్, కళ్యాణ్‌కుమార్ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిని రేపు కోర్టులో హాజరుపర్చారు.
స్కీంను.. స్కాంగా మార్చిన వైనంపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. వెటర్నరీ శాఖలో ఉన్నతాధికారులను విచారిస్తున్నారు. స్కిం కాస్ట్ పెంచడం, దళారుల పాత్రపై కీలక సమాచారం రాబట్టారు అధికారు. ఎవరు అధికారిగా ఉన్నప్పుడు స్కిం కాస్ట్ పెంచారో అనే విషయంపై ఆరా తీస్తున్నారు. త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. .
Comments
Please login to add a commentAdd a comment