ఆంధ్రా దళారులకు వరం.. గొర్రెల పథకం
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
జగిత్యాల అగ్రికల్చర్: యాదవులకు ప్రభు త్వం ఇస్తున్న సబ్సిడీ గొర్రెల పథకం ఆంధ్రా దళారులకు వరంగా మారిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల మండలం ధర్మా రంలో యాదవులకు గురువారం ఆయన సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. ఆంధ్రా దళారులు మన రాష్ట్రంలో గొర్రెను రూ.4 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని, వాటిని మన గొల్లకుర్మలకు రూ. 6 వేల నుంచి రూ.7 వేలకు అంటగడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు ఆంధ్రోళ్లే అడ్డంకి అని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు గొర్రెల రూపేణా ఆంధ్రా దళారులకే లాభం చేస్తోందని ఎద్దేవా చేశారు. వర్షాకా లంలో పశువులకు గాలికుంటు టీకాలు వేయాలని సీఎం, పశుసంవర్ధకశాఖ మంత్రి, వెటర్నరీ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు.