
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న వాహనదారుల కట్టడికి తెలంగాణ పోలీసులు కొత్త ప్రయత్నం చేశారు. కాలనీ నుంచి బయటకు వచ్చే వాహనాలను రిజిస్టర్ చేసి.. వాటి వివరాలను నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అప్‌డేట్ చేస్తున్నారు. మూడు కిలోమీటర్లు దాటి ఎవరైనా వాహనాలపై ప్రయాణిస్తే.. చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నిఘా కార్యక్రమం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని కట్టడి చేసేందుకే పోలీసు శాఖ ఈ చర్యలు చేపట్టింది.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 987కి చేరింది. 25 మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణలో 67 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment