23 అర్ధరాత్రి నుంచి లారీల నిరవధిక బంద్
హైదరాబాద్: లారీ యజమానుల సమస్యల పరిష్కారానికిగాను ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి లారీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చామని, దీనిని విజయవంతం చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఆదివారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు నూకల భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి జి.దుర్గాప్రసాద్ మాట్లాడారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 23 జిల్లాలకు చెల్లించిన ట్యాక్స్‌నే ఇప్పుడు కూడా చెల్లిస్తున్నా అది తెలంగాణ 10 జిల్లాలకే వర్తిస్తోందన్నారు.
ఏపీకి వెళ్లాలంటే సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. లారీల ఎగుమతులు, దిగుమతుల పన్నులు కిరాయిదారులే భరించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.