
నిరసన వ్యక్తం చేస్తున్న సంధ్యారాణి
శ్రీరాంపూర్(మంచిర్యాల): తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి ప్రియుడి ఇంటిఎదుట ఆదివారం ఆందోళన చేపట్టింది. శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌కు చెందిన ఈద సంధ్యారాణి అదే ప్రాంతానికి చెందిన దాట్ల రోహిత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొదట్లో వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది.
అతని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ తప్పించుకుంటున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలిపింది. రోహిత్ కుటుంబం తనకు న్యాయం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తానని పేర్కొంది. సంధ్యారాణి తండ్రి నర్సయ్య గతంలోనే చనిపోగా తల్లి విజయ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఓ చెల్లి కూడా ఉంది. కుటుంబంలో పెద్దదిక్కులేని తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment