love marriage issue
-
ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..!
వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లితండ్రులతో పాటు సోదరుడు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వలిగొండ మండలం వేములకొండకు చెందిన యాట నవీన్ అదే గ్రామానికి చెందిన ఎలగందుల మానస ప్రేమించుకుని 15 మాసాల క్రితం ఇళ్ల నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నవీన్ బుధవారం వలిగొండ మధిర గ్రామం మల్లేపల్లికి వచ్చాడు. దహనసంస్కారాలు పూర్తయిన తర్వాత నవీన్ స్వగ్రామం వేములకొండకు వచ్చాడు. సాయంత్రం ఇంటి సమీపంలోని వాటర్ ఫిల్టర్ వద్ద మిత్రులతో కలిసి మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న మానస తల్లిదండ్రులు మార్కండేయ, సరస్వతి, సోదరుడు మత్స్యగిరి ముగ్గురు కలిసి కత్తితో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నవీన్‌ను పట్టుకోగా ఒకరు కత్తితో అతడి శరీరంపై ఇష్టానుసారంగా పొడిచారు. ఒకరి తర్వాత మరొకరు నవీన్ శరీర భాగాలపై దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న నవీన్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు తొలుత వలిగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం నవీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ఇది చదవండి: జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..! -
ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై దాడి! అల్లుడిని దారుణంగా..
సాక్షి, సంగారెడ్డి: నెల రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై కత్తులతో దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీరుడి అనిల్ రామచంద్రాపురం మండలంలోని స్టేషన్ నాగులపల్లి గ్రామానికి చెందిన అశ్విని (దగ్గరి బంధువులు) నెల రోజుల క్రితం ఇరువురి కుటుంబాలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. తమకు ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో అప్పటినుంచి నస్తీపూర్‌లోని అనిల్ ఇంటి వద్దే నూతన దంపతులు ఉంటున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నవంబర్ 5న పెద్దల సమక్షంలో వివాహం జరిపించేందుకు యువకుడి కుటుంబీకులు నిశ్చయించి పెళ్లిపత్రికలు ముద్రించారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు, బంధువులు సోమవారం తెల్లవారుజామున నస్తీపూర్‌లోని అనిల్ ఇంటిపై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్తున్న క్రమంలో అడ్డుకోబోయిన భర్త అనిల్‌పై కత్తితో తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన అనిల్‌ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనిల్ తండ్రి నీరుడి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుకుమార్ తెలిపారు. ఇవి చదవండి: 'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం! -
ప్రేమ పెళ్లితో.. పుట్టింటి వారికి చెప్పుకోలేక.. మౌనంతో చివరికీ..
సంగారెడ్డి: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన మండల పరిధిలోని షాద్‌నగర్ (గట్పల్లి)లో గురువారం జరిగింది. ఎస్ఐ కోటేశ్వర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలుగానం శ్రీలత (21)ను ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన సిరూర్ రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులుగా శ్రీలతను పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని భర్త రవితో పాటు అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందనే కోపంతో శ్రీలత తల్లిదండ్రులు ఇంటికి దూరం పెట్టారు. వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటి వారికి చెప్పుకోలేక.. అత్తింటివారిని ఎదురించలేక ఈనెల 8న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. మృతురాలి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
Hyderabad: పథకం ప్రకారమే నారాయణరెడ్డి హత్య!
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాకు చెందిన నారాయణరెడ్డిని నిందితులు పక్కా పథకం ప్రకారమే అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తు న్న శ్రీనివాస్‌రెడ్డి..తన బంధువుల అమ్మాయి ని నారాయణరెడ్డి ప్రేమ, పెళ్లి పేరుతో పరువుకు భంగం కలిగించడంతో పాటు మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని..అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని మరో ఇద్దరు నిందితులతో కలిసి రెండు నెలల ముందే పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందుకు అవసరమయ్యే ఖర్చులు, సహకరించిన వారికి సుపారీ పేరు తో యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డి నుంచి రూ.ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ముందుగా మూడు లక్షలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు అదే ప్రాంతానికి చెందిన కాశీ, షేక్ ఆషిక్లతో కలిసి నారాయణరెడ్డిని గత నెల 27న అంతమొందించిన త ర్వాత విషయాన్ని వెంకటేశ్వరరెడ్డికి వీడియోకాల్ ద్వారా తెలిపి ముగ్గురు ఒక్కొక్క లక్ష రూపాయలు తీసుకొని ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. అయితే నారాయణరెడ్డి కనిపించకుండా పోయిన ఫిర్యాదును స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును మొదలు పెట్టారు. నారాయణరెడ్డికి చివరిగా వచ్చిన శ్రీనివాసరెడ్డి సెల్ నెంబర్ ఆధారంగా అతనికి ఫోన్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరెడ్డి మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి తనకు పోలీసులు ఫోన్ చేస్తున్నారు, మీరు కూడా ఎవరికి దొరకకుండా ఉండాలని, ఏమి చెప్పవద్దని హెచ్చరించి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. దీంతో శ్రీనివాసరెడ్డి ఫోన్ నుంచి చివరిగా కాల్ వెళ్లిన కారు డ్రైవర్ షేక్ ఆషిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మొత్తం కుట్రకోణం బట్టబయలయ్యింది. దీంతో శ్రీనివాసరెడ్డి, కాశి, షేక్ ఆషీక్, వెంకటేశ్వరరెడ్డిలపై కేసునమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా హత్యకేసులో ముందుగా పట్టుబడి వివరాలు వెల్లడించిన షేక్ ఆషిక్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది. షేక్ ఆషిక్ నగరంలోని ఓ పేరొందిన కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేసినట్లు తెలిసింది. అయితే అతని ఇంటిని గాలించిన సమయంలో అతని ప్యాంటు జేబుల్లో 50 వేల నగదుతో పాటు అతను తాను చదువుతున్న కళాశాల నుంచి తీసుకున్న టీసీ కనిపించింది. కాగా శ్రీనివాసరెడ్డి, కాశీలు గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో గతంలోనే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. చదవండి: (Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!) -
Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!
జిన్నారం/పటాన్చెరు టౌన్/కేపీహెచ్‌బీ (హైదరాబాద్): హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ప్రేమ వివాహమే ఈ ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం రమ్మంటూ యువకుడిని పిలిచిన యువతి బంధువు ఫుల్లుగా మద్యం తాగించి, మరొకరి సహకారంతో గొంతు నులిమి హత్య చేసి శివారు అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశారు. కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో.. కేపీహెచ్‌బీ, జిన్నారం సీఐలు కిషన్‌కుమార్, వేణు కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా పొదల కొండపల్లికి చెందిన శనివారపు బాలిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి (25) ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ ఒకటిలోని ఓ ఇంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 27న రాత్రి 9 గంటల సమయంలో తాను శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి తిరిగిరాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో అతని స్నేహితులు నారాయణరెడ్డి బావ వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. ఆయన గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని గ్రామానికే చెందిన కారు డ్రైవర్ షేక్ ఆషిక్‌లపై నిఘా పెట్టారు. తర్వాత ఆషిక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా నారాయణ రెడ్డిని హత్య చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా గుర్తించారు. వెంటనే 80 శాతం దహనమైన స్థితిలో ఉన్న నారాయణ రెడ్డి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబీకులు నారాయణరెడ్డి ఏడాది కిందట తన స్వగ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించకపోగా యువతిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయినా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో యువతి కుటుంబీకులు నారాయణ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డిని అతని గది నుంచి బయటకు రప్పించిన పొదల కొండపల్లికే చెందిన యువతి బంధువు శ్రీనివాస్ రెడ్డి.. ఆషిక్ కారులో రాయదుర్గం తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు జిన్నారం ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆషిక్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు హత్యోదంతంలో పాల్గొన్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. యువతి కుటుంబసభ్యులు మరికొందరి ప్రమేయం పైనా, సుపారీ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత -
ప్రేమించిన యువతితో పెళ్లి వద్దన్నారని..
సాక్షి, హైదరాబాద్ (సైదాబాద్): ప్రేమించిన యువతితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సైదాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్‌లాల్ నాయక్ తెలిపిన వివరాలు.. మాధవనగర్‌లో నివసించే జి.నాగేశ్వర్ కుమారుడు ప్రజ్వల్ (28) ఎంబీఏ చదువుతున్నాడు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయమని ఇంట్లో తల్లిదండ్రులను కోరాడు. అయితే తండ్రి ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని చెప్పడంతో అలిగిన ప్రజ్వల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుని గురించి బంధు మిత్రుల దగ్గర విచారించినా ఫలితం లేకపోవటంతో తండ్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజ్వల్ గతంలోనూ ఇలా ఇంటి నుంచి అలిగివెళ్లి తిరిగివచ్చాడని ఫిర్యాదులు పేర్కొన్నాడు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: పెళ్లి చేసుకుంటావా.. లేదా అంటూ యువతిని నడిరోడ్డుపై ) -
ఫేస్బుక్ పరిచయం.. పెళ్లి చేసుకున్న 15 రోజులకే..
సాక్షి, నందవరం: ప్రేమ పెళ్లి చేసుకుని పదిహేను రోజులకే ముఖం చాటేయడంతో భర్త ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. నందవరం మండల కేంద్రానికి చెందిన రాకేష్ గౌడ్‌కు ఫేస్బుక్లో హైదరాబాద్‌కు చెందిన అనూష పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం గత నెల 4న ఇద్దరూ హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు 15 రోజుల తరువాత స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి రాకేష్ నందవరానికి వచ్చాడు. వారం రోజుల నుంచి ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో యువతి ఆందోళన చెంది నందవరం చేరుకుంది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో రాకేష్ తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించలేదు. దీంతో మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించింది. కాగా యువతి మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం) -
భార్య నుంచి విడదీశారని సెల్ టవర్ ఎక్కి..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా అన్నముబొట్లవారిపాలెంలో సెల్‌టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తన నుంచి విడదీసి.. అక్రమ కేసు పెట్టారని అతను ఆరోపిస్తున్నాడు. తాను పెళ్లి చేసుకున్న యువతిని తనతోపాటు పంపించేవరకు సెల్‌టవర్ దిగేది లేదని పట్టుబట్టాడు. అన్నముబొట్లవారిపాలెంకు చెందిన యువతి గుంటూరులో చదువుకుంటుడగా... ఆటో నడుపుకుంటున్న నామాల చందుతో పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో... పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన నెల తర్వాత యువతి తాను మోసపోయానంటూ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసిందని స్థానికులు చెప్తున్నారు. చందూపై పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని సమాచారం. ఈ క్రమంలో చందూ రాత్రి అన్నముబొట్లవారిపాలెంలోని యువతి ఇంటికి వచ్చి.. ఆమె తల్లిదండ్రులతో గొడవపడ్డాడని చెప్తున్నారు. చుట్టపక్కవారు వచ్చేసరికి అక్కడినుంచి పరారయ్యాడని, ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ సెల్‌టవర్ ఎక్కి చందూ గొడవ చేస్తున్నాడని యువతి బంధువులు మండిపడుతున్నారు. పర్చూరు పోలీసులు యువకుడికి నచ్చజేపే ప్రయత్నం చేస్తున్నారు. -
తక్కువ కులమని వదిలేశాడు
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ప్రేమించి, పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు కాపురం చేసిన భర్త తక్కువ కులమని తనను వదిలేసి మరో వివాహానికి సిద్ధమయ్యాడని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను మందలించి, కాపురాన్ని నిలబెట్టాలని కోరుతూ శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వేడుకుంది. ఆమె కథనం మేరకు.. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ చింతమాకులపల్లెకు చెందిన సరస్వతికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. మదనపల్లె రామారావు కాలనీ పోలేరమ్మ గుడి వీధికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఫోన్ కాల్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. తర్వాత మాటలు కలిసి వ్యవహారం ప్రేమ వరకు వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కులాలు వేరని, వివాహాన్ని పెద్దలు అంగీకరించని చెప్పినా వినకుండా గత ఏడాది ఏప్రిల్ 4న చింతమాకులపల్లెలో పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. రామారావు కాలనీలో రెండు నెలల పాటు సజావుగా సాగిన తమ కాపురంలో భర్త ప్రవీణ్ తాగుడుకు అలవాటు పడటం, కొట్టడం, హింసించడం, సూటిపోటి మాటలతో అలజడి మొదలైందని బాధితురాలు సరస్వతి వాపోయింది. అమ్మచెరువుమిట్టలో తన పేరున ఉన్న భూమిని రూ.3.80లక్షలకు అమ్మి జల్సా చేసేశాడంది. అత్తామామలతో కలిసి తక్కువ కులందానివని తనను దూషిస్తూ, నీతో కాపురం చేయాలంటే రూ.10లక్షల కట్నం ఇవ్వాలంటూ బయటకు నెట్టేశారని తెలిపింది. ఈ విషయమై ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో న్యాయంకోసం ప్రెస్‌క్లబ్‌ను ఆశ్రయించానంది. తన భర్తకు అత్తామామలు రెండో వివాహం చేసినట్లు తెలిసినవారు చెప్పారని, అదే జరిగితే తనకు మరణం తప్ప మరోదారి లేదని కన్నీరుపెట్టుకుంది. తన భర్తను పిలిపించి, తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. బాధితురాలు సరస్వతికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, ఏఐటీయూసీ చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్ మద్దతు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకు అండగా నిలుస్తామన్నారు. -
మోసపోయా.. న్యాయం చేయండి
సాక్షి, మదనపల్లె టౌన్ : పెద్దలను ఎదిరించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా..తనకు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇప్పుడు తన భర్త కాపురానికి రాకుండా మోసం చేస్తున్నాడు. పిల్లలు పుట్టాక ఇప్పుడు తనకు వద్దని బాధిస్తున్నాడు. న్యాయం చేయండంటూ మంగళవారం ఓ యువతి చంటి బిడ్డతో మదనపల్లె డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు.. వైఎస్సార్ జిల్లా చిట్వేలి మండలం, చెర్లోపల్లెకు చెందిన నరసయ్య, జయలక్ష్మిల కుమార్తె అరుణ(23) కడపలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేది. ఈ క్రమంలో కేవీ పల్లె మండలం, చీనేపల్లె గ్రామం, గుండ్రవారిపల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరు మూడేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి కర్ణాటకలో కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. అయితే ప్రతాప్‌రెడ్డి అరుణను డబ్బులు తీసుకు వస్తే వ్యాపారం ప్రారంభించి బతుకుదామని చెప్పాడు. అరుణ డబ్బులు సమకూర్చలేక పోవడంతో ఆమెను ప్రియుడు కొంతకాలం క్రితం వదిలేశాడు. దీంతో చేసేది లేక అరుణ కేవీపల్లె పోలీసులను ఆశ్రయించింది. భర్తతో తన కాపురాన్ని నిలబెట్టాలని కోరింది. అక్కడి పోలీసులు ప్రతాప్ రెడ్డిని, అరుణను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారి కాపురం చక్కబడక పోవడంతో చేసేది లేక బాధితురాలు అరుణ న్యాయం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం మదనపల్లె డీఎస్పీ కోసం వచ్చింది. ఆ సమయంలో డీఎస్పీ రవి మనోహరాచారి అందుబాటులో లేక పోవడంతో ఇన్‌ఛార్జి డీఎస్పీ(ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ) వంశీధర్ గౌడ్‌ను కలిసింది. డీఎస్పీ కేవీపల్లె పోలీసులతో మాట్లాడగా ఇప్పటికే కేసు నమోదుచేశామని వారు చెప్పారు. ఈ విషయాన్ని అరుణకు డీఎస్పీ వివరించినా ఆమె వినకుండా తనకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ ఆఫీసు వద్దనే కూర్చుని నిరసనకు దిగింది. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా..అరుణ ఫిర్యాదు మేరకు ఇదివరకే ఇద్దరిని కేవీపల్లె స్టేషన్‌కు పిలిపించి కలపడానికి ప్రయత్నించామన్నారు. అయితే ఆమె కాస్త ఓపిక పట్టకుండా రోజూ ఎస్పీ, డీఎస్పీ ఆఫీసుల చుట్టు తిరుగుతోందన్నారు. భర్తతో కాపురం చేయించాలని ఆమె కోరుతోందదని అది తమ చేతుల్లో లేదని ఆయన పేర్కొన్నారు. -
కాకినాడ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి..
సింగరేణి(కొత్తగూడెం): కాకినాడకు చెందిన అమ్మాయి.. హైదరాబాద్‌కు చెందిన అబ్బాయి.. వారిద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకునేందుకు దారి తీసింది. కొత్తగూడెంలో పెళ్లి చేసుకుని, ఇక్కడే పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ పెళ్లి ఇష్టంలేని అమ్మాయి తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు కానిస్టేబుళ్లు ఈ జంటను తీసుకెళ్లేందుకు కొత్తగూడేనికి వచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. కాకినాడకు చెందిన విత్తనాల వెంకటలక్ష్మీపూజితకు హైదరాబాద్‌కు చెందిన తంగెళ్ల హిమేశ్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలు అంగీకరించరని తెలిసిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం వెంకటేశ్‌ఖనిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన వివాహం చేసుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18వ తేదీన కొత్తగూడెంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా, కాకినాడ ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూజిత తండ్రి వెంకటశ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి తన కూతురు కన్పించడంలేదని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హిమేశ్, పూజిత కొత్తగూడెంలో వివాహం రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించి ఇక్కడకు వచ్చారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుల సహకారంతో వారిద్దరినీ రప్పించి కోర్టుకు అప్పగించేందుకు ఆంధ్రా నుంచి వచ్చిన ఎస్సై బి.శంకర్, కానిస్టేబుల్ రమేశ్‌తోపాటు మరో మహిళా కానిస్టేబుల్‌కు అప్పగించారు. కాగా, ఈ ప్రేమ, పెళ్లి వ్యవహారంపై కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ కుమారస్వామిని వివరణ కోరగా కోర్టు ఆదేశాల మేరకు హిమేశ్, పూజితను అమరావతి నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించామని, మంగళవారం కోర్టు సమయం ముగియడంతో బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చే అవకాశముందని వెల్లడించారు. -
ప్రేమించినవాడితో పెళ్లి జరిపించాలని..
పెద్దపల్లి: ‘మూడేళ్లుగా ప్రేమించుకున్నాం..ఆతడిని నమ్ముకుని సర్వం అర్పించా..ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్న యువకుడితోనే పెళ్లి జరిపించాలని దామ అనూష అనే యువతి గురువారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన దామ అనూష(20) అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్(24) మూడేళ్లుగా ప్రేమించుకుటున్నారు. కొద్దిరోజులుగా వేరే అమ్మాయితో పెళ్లి జరిపించేందుకు శ్రీకాంత్ తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న అనూష గురువారం వాటర్ ట్యాంకు ఎక్కింది. దీంతో స్థానికులు పెద్దపల్లి సీఐ నరేందర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న సీఐ, అనూషతో మాట్లాడి సముదాయించి కిందకు దింపారు. గ్రామస్తులు అనూష, శ్రీకాంత్‌ల పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు. చట్టంప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హామీఇచ్చారు. మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించి జంటను కలపాలని యువతికి న్యాయం చేయాలని అనూష బంధువులు సీఐని వేడుకున్నారు. -
ప్రేమే గెలిచింది..
భీమారం: ప్రేమించిన వాడిని మనువాడడం కోసం చేసిన పోరాటంలో ఆమె గెలవడంతో పాటు ప్రేమను జయించింది. తన ప్రియుడితో మరో యువతికి నిశ్చితార్థమైందని తెలిసిన ఆమె సెల్ టవరు ఎక్కింది. 7 గంటల హైడ్రామా అనంతరం టవర్ పైనుంచి కిందికి దిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, బంధువుల ఆందోళన అన ంతరం ప్రేమ కథ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. రంగంలోని దిగిన ఏసీపీ ప్రియుడిని పిలిపించి ప్రేమ జంటకు కౌనెల్సింగ్ ఇచ్చారు. అనంతరం రాత్రి పోలీసుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. వివరాల ప్రకారం .. హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన దామెర మాలిక, నక్క బాబు పదేళ్ల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. బాబు సింగరేణి ఉద్యోగి కాగా, మాలిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల బాబుకు అదే గ్రామానికి చెందిన మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈవిషయమై మాలిక అదే రోజు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. అయినా నిశ్చితార్థం తంతు ఆగలేదు. ప్రియుడి విచారణ. ఇదిలా ఉండగా పోలీసులు బాబును కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. మాలికతో ఉన్న సంబంధంపై అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం వరకు సమయం ఇస్తాం... ఆలోచించుకోవాలని సూచించారు. కొద్దిసేపు వారు మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఒక్కటయ్యారు.. ఎట్టకేలకు మాలిక తన పంతం నెగ్గిచ్చుకుంది. చివరికి ప్రియుడితో వివాహం జరిగింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాబు. మాలిక ఒక్కటయ్యారు. పెళ్లి చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం మేరకు అక్కడికి చేరిన ఏసీపీ చంద్రయ్య ఆందోళనకారులను శాంతింజేశారు. అనంతరం ఇద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించడమే కాకుండా పెద్దమనుషులతో మాట్లాడారు. అనంతరం ఇరువురి అంగీకారం మేరకు మాలిక–బాబు పోలీస్‌స్టేషన్ ఎదుట పూలదండలు మార్చుకున్నారు. ఈసందర్భంగా మాలిక మెడలో తాళి కట్టాడు. న్యాయం జరగలేదని.. పోలీసుల నుంచి ఆశించిన న్యాయం జరగకపోవడంతో మాలిక మంగళవారం ఉదయం 4.30 గంటలకు పెగడపల్లి సమీపంలోని ఓసెల్టవర్ ఎక్కింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. సెల్ టవర్ నుంచి కిందకు దిగాలని కోరారు. అయినప్పటికీ ఆమె దిగడానికి నిరాకరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితురాలు ఉదయం 11.30 నిమిషాలకు సెల్ టవర్ దిగింది. పోలీసులు మాలికను తమ వాహ నంలో కూర్చోబెట్టి ముందుకు సాగారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బాబుతో పెళ్లి జరపాలని వాహనం ఎదుట కూర్చున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు మాలికను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష
ఎల్కతుర్తి : తనను శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకు తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీపతి శ్వేత ఇంటర్ చదివే రోజుల్లో అదే మండలానికి చెందిన సట్ల సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత హైదరాబాద్‌లోని ఓ బ్యూటీషియన్ సంస్థలో సభ్యురాలిగా పని చేస్తోంది. సుధీర్ సైతం హెచ్‌డీఎఫ్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ అద్దె గదిలో సహజీవనం చేస్తున్నారు. గదిలోనే తాళి సైతం కట్టాడని శ్వేత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్ద మనుషులు కలుగజేసుకుని పెళ్లి కోసం ప్రయత్నాలు చేశారు. దీనికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం తాను లేని సమయంలో గదిలోకి ఎవరో యువకుడు వచ్చాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తనను అనుమానిస్తూ గొడవపడ్డాడని.. అప్పటి నుంచి తాను పెళ్లి చేసుకోనంటూ తప్పించుకు తిరుగుతున్నాడని స్వేత బోరున విలపించింది. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు.పెద్ద మనుషులు సైతం పట్టించుకోలేదు. దీంతో తాను ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగినట్లు తెలిపింది. బాధితురాలి మౌనపోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా సుధీర్ తండ్రి మల్లయ్య తనను ఓ విలేకరి రూ. 5లక్షలు ఇస్తే సముదాయిస్తానని, లేకుంటే ఇంటి ముందు బైఠాయిస్తుందని చెప్పాడని, తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అనుకున్న ప్రకారం ఇలా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. -
ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన
శ్రీరాంపూర్(మంచిర్యాల): తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి ప్రియుడి ఇంటిఎదుట ఆదివారం ఆందోళన చేపట్టింది. శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌కు చెందిన ఈద సంధ్యారాణి అదే ప్రాంతానికి చెందిన దాట్ల రోహిత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొదట్లో వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది. అతని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ తప్పించుకుంటున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలిపింది. రోహిత్ కుటుంబం తనకు న్యాయం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తానని పేర్కొంది. సంధ్యారాణి తండ్రి నర్సయ్య గతంలోనే చనిపోగా తల్లి విజయ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఓ చెల్లి కూడా ఉంది. కుటుంబంలో పెద్దదిక్కులేని తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది. -
ప్రేమిస్తే విడదీస్తారా..?
వాళ్లిద్దరూ బీటెక్ చదువుతున్నారు. పక్క పక్క వీధుల్లోనే ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అబ్బాయి ఇంట్లో తెలియడంతో పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఇంతలో అబ్బాయికి మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమాచారం తెలియడంతో అమ్మాయి సదరు అబ్బాయి ఇంటివద్దకు వెళ్లింది. అప్పటికే తలుపులకు తాళం వేసి ఉండటంతో న్యాయం కోసం ఆందోళన చేపట్టింది. అనంతపురం సెంట్రల్: తనను ప్రేమించిన యువకుడికి మరొకరితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి ఓ యువతి న్యాయం కోసం యువకుడి ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టింది. యువకుడి కుటుంబ సభ్యులు ముందుగానే సమాచారం తెలుసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వివరాల్లోకెళ్తే.. నగరంలోని సున్నపుగేరిలో నివాసముంటున్న ఓ యువతి, పక్క వీధిలోనే ఉంటున్న శివ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు కళాశాలల్లో బీటెక్ చదువుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసి అబ్బాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. అప్పటి నుంచి వీరిద్దరినీ కలవకుండా కట్టడి చేశారు. అబ్బాయి తండ్రి మునిసిపల్ రిటైర్డు ఉద్యోగి. అమ్మాయి కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. దీనికితోడు కులాలు కూడా వేరు కావడంతో ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో శివకు వేరొకరితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసుకున్న యువతి శనివారం సాయంత్రం యువకుని ఇంటి వద్దకు వచ్చింది. అప్పటికే విషయం తెలుసుకున్న యువకుని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ వారి ఇంటి వద్దే యువతి గంటపాటు మౌనదీక్ష చేపట్టింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు యువతితో చర్చించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐ విజయభాస్కర్గౌడ్ను వివరణ కోరగా ఇరు కుటుంబాల సభ్యులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అబ్బాయి నిర్ణయం తెలుసుకున్నాక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రేమపెళ్లి..ఇద్దరు ఒకే కులం అయినా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రేమపెళ్లి చేసుకున్న ఓ యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో సోమవారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలకు గురైన యువకుడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని దుమాల గ్రామానికి చెందిన దుంపలపల్లి మహేశ్(23) అదే గ్రామానికి చెందిన సోమారపు రేఖ(21) ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు అయినప్పటికీ రేఖ మహేష్‌కు వరుసకు చెల్లెలు కావడం వల్ల వారి పెళ్లిని అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో గతేడాది నవంబర్ 21న హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఉంటున్నారు. అయితే ఇరువురూ ఇంటికి రాకుంటే మహేశ్ తల్లిని చంపివేస్తామని రేఖ కుటుంబ సభ్యులు బెరించారు. దీంతో ఇరువురూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే నెల తిరగకుండానే ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 9న పోలీస్‌స్టేషన్‌లో రెండువర్గాల వారు పంచాయితీ చేసుకున్నారు. మహేశ్ ఇకపై రేఖను కలువరాదని షరతులు పెట్టి పుట్టింటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆదివారం కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి రేఖ కరీంనగర్ వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఆమెను వెంబడించి కొదురుపాక వద్ద కలిసి తనతో ఉండాలని ఒత్తిడి చేశాడు. యువతి ఇంటికి వెళ్లి మహేశ్ వెంటపడి వేధించాడని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కోపోదిక్తులైన వారు మహేష్ ఇంటికి వెళ్లి దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అడ్డుగా వెళ్లిన తల్లి బాలమణిని సైతం చితకబాదారు. పోలీసులు రంగంలోకి దిగి మహేశ్‌తో పాటు అతని తల్లిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. పెళ్లి ఇష్టం లేకనే దాడి నా కొడుకు రేఖను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కర్రలు, రాడ్‌తో దాడి చేశారు. కులాలు ఒక్కటైనా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నా కొడుకు చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు. అమ్మాయి కుటుంబసభ్యులు షరవింద్, బాను, బాల్‌రాజు, చందు, వజ్రవ్వ ఆమె భర్త కలిసి కొట్టారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – బాలమణి, మహేశ్ తల్లి -
నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకుండా?
పరకాల (వరంగల్): నువ్వే నా ప్రాణం.. నువ్వు తోడుగా లేకపోతే బతకలేను అంటూ ఐదేళ్లుగా చెట్టపట్టాలేసుకొని తిరిగిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగిన సంఘటన పరకాల పట్టణంలో మంగళవారం జరిగింది. పరకాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన అల్లె రాము, రావుల రాణి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు ప్రియురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరి మేజర్లు కావడంతో రాఖీ పౌర్ణమి మరుసటి రోజే ఓ మిత్రురాలి సమక్షంలో పెళ్లికి నిశ్చితార్థం పెట్టుకున్నారు. రాము కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాము కుటుంబసభ్యుల ఒత్తిడితో తాను ప్రేమించలేదంటూ ముఖం చాటేశాడు. దీంతో అవాక్కయిన రాణి ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసేంత వరకు ఇంటి ముందే ఉంటానని, లేదంటే ఆత్మహత్యకైనా సిద్ధమంటూ వాపోయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. రాము కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు వేసి మాయమయ్యారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రియుడి ఇంటి ఎదుటే బైఠాయించినా స్థానికులు, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన ప్రేమ వ్యవహారం