ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి చేసుకున్న 15 రోజులకే.. | Love Marriage Issue In Kurnool District | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు 

Aug 8 2020 6:49 AM | Updated on Aug 8 2020 11:40 AM

Love Marriage Issue In Kurnool District - Sakshi

రాకేష్‌, అనూష పెళ్లి నాటి చిత్రం(ఫైల్‌)  

సాక్షి, నందవరం: ప్రేమ పెళ్లి చేసుకుని పదిహేను రోజులకే ముఖం చాటేయడంతో భర్త ఇంటి ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. నందవరం మండల కేంద్రానికి చెందిన రాకేష్‌ గౌడ్‌కు ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌కు చెందిన అనూష పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం గత నెల 4న ఇద్దరూ హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టారు.


బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
15 రోజుల తరువాత స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి రాకేష్‌ నందవరానికి వచ్చాడు. వారం రోజుల నుంచి ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో యువతి ఆందోళన చెంది నందవరం చేరుకుంది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో రాకేష్‌ తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించలేదు. దీంతో మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించింది. కాగా యువతి మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.    (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement