![Madhira Assembly Constituency Candidates Canvass - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/26/mad.jpg.webp?itok=fhV1lNoJ)
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, మధిర: మధిరలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న లింగాల కమల్‌రాజ్‌దే గెలుపని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆత్కూరు, రాయపట్నం, దేశినేనిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ... కాంగ్రెస్, టీడీపీ అక్రమ పొత్తు పెట్టుకొని మాయకూటమిగా ఏర్పడి ప్రజలను మాయ చేసేందుకే ముందుకు వస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. దేశమంగా గర్వించే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. మధిర గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, విషప్రచారాలు నమ్మే ప్రజలు కారని అన్నారు. నిత్యం అందుబాటులో ఉండే కమల్‌రాజ్‌ను పార్టీలకు అతీతంగా ఆదరిస్తూ కారు గుర్తుపై ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, నాయకులు మేకల లక్ష్మి, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, ఇక్బాల్, భోగ్యం ఇందిర, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యన్నం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment