
స్పీకర్ గా మధుసూదనాచారి ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి స్పీకర్ గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ కె. జానారెడ్డి ప్రకటించారు.
సీఎం కేసీఆర్ సహా వివిధ పార్టీల ఫ్లోర్లీడర్లు మధుసూదనచారిని స్పీకర్ స్థానం వరకు గౌరవంగా తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో ఆయన ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... మధుసూదనాచారి సేవలను కొనియాడారు. మధుసూదనాచారి వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం.