రైల్వే ఉద్యోగితో ఘర్షణ : ఫోన్లు ధ్వంసం | Man destroy telephone in karepally Railaway station | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగితో ఘర్షణ : ఫోన్లు ధ్వంసం

Published Sat, Nov 25 2017 10:01 AM | Last Updated on Sat, Nov 25 2017 10:03 AM

Man destroy telephone in karepally Railaway station - Sakshi

కారేపల్లి: ఓ యువకుడికి, రైల్వే టికెట్‌ కౌంటర్‌లో ఉద్యోగికి మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన యువకుడు స్టేషన్‌లోని ల్యాండ్‌ ఫోన్లను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం-భద్రాచలం రోడ్డు రైలు మార్గంలోని కారేపల్లి రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం జరిగింది. తమ బంధువులు రైలు ఎక్కాలి.. టికెట్టు ఇవ్వమంటూ సారంగపాణి, సంపత్‌ అనే యువకులు టికెట్‌ కౌంటర్‌ వద్దకు వచ్చారు. అయితే రైలు కదులుతోంది.. టికెట్టు ఇవ్వడం కుదరదంటూ ఆ ఉద్యోగి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యువకులు ఆ ఉద్యోగితో ఘర్షణ పడ్డారు. 

అనంతరం స్టేషన్‌ మేనేజర్‌ను కలిసేందుకు వెళ్తుండగా అక్కడున్న రైల్వే సిబ్బంది వారిని అడ్డగించి తోసేయడంతో సారంగపాణి గోడకు తగిలి కిందపడ్డాడు. గాయపడిన అతను ఆగ్రహంతో అక్కడున్న ల్యాండు ఫోన్లను ధ్వంసం చేయడంతో కొద్దిసేపు కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో రెండో యువకుడు సంపత్‌ అక్కడినుంచి జారుకున్నాడు. అనంతరం డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రైల్వే పోలీసులు వచ్చి వివరాలు సేకరించి ఆ యువకులపై కేసు పెట్టారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement