రెండు బైక్ లు ఢీ, వ్యక్తి మృతి | man died in a bike accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్ లు ఢీ, వ్యక్తి మృతి

Published Sun, Feb 22 2015 8:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

man died in a bike accident

చేవెళ్ల(రంగారెడ్డి): ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అంతేకాకుండా అతనితో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు... చేవెళ్ల గ్రామానికి చెందిన మల్లెల గంగయ్య(37) స్నేహితునితో కలిసి బైక్‌పై గ్రామానికి వస్తుండగా వేగంగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయలైన గంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు నగరంలోని ఓ పైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement