బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
Published Thu, Aug 11 2016 12:38 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
రుద్రవరం : కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి జారిపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గున్నంపాడు గ్రామానికి చెందిన ఆంటోని(38)గా గుర్తించారు. బైక్‌పై రుద్రవరం నుంచి స్వగ్రామం గున్నంపాడు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement