జాడలేని జోజి మృతదేహం | Man Missing In SRS Canal | Sakshi
Sakshi News home page

జాడలేని జోజి మృతదేహం

Published Wed, Oct 31 2018 12:45 PM | Last Updated on Fri, Nov 9 2018 1:01 PM

Man Missing In SRS Canal - Sakshi

రోదిస్తున్న జోజి భార్య జ్యోతి, కూతుళ్లు తేజస్విని, కీర్తనలు కెనాల్‌లో గల్లంతైన జోజి(ఫైల్‌) 

సంగెం(పరకాల): చూస్తుండగానే ఎస్సారెస్పీ కెనాల్‌లో గల్లంతైన జోజి మృతదేహం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం గాంధీనగర్‌ గ్రామానికి చెందిన కట్టవరపు జోజి(30) ఈనెల 23న కూలి పనికి వెళ్లి ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ ఒడ్డున మోటార్‌ ఏర్పాటు చేసి అవతల ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కరెంట్‌ వైరు కలిపేందుకు ఈదుకుంటూ వెళ్లి తిరిగి వస్తుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయిన విషయం విధితమే. అక్కడే ఉన్న పలువురు అతడిని రక్షించేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది.

ఆతర్వాత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కెనాల్‌లో ఎంత వెతికినా వారం రోజులుగా మృతదేహం లభించలేదు. జోజి గల్లంతైన గాంధీనగర్‌ నుంచి తీగరాజుపల్లి, ఇటు వర్ధన్నపేట, రాయపర్తి, మైలారం రిజర్వాయర్, అటు మహబూబాబాద్‌ జిల్లా కురవి వరకు కెనాల్‌ వెంట రాత్రీ పగలు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు తేజస్విని, కీర్తనతోపాటు బంధువులు రోదిస్తున్నారు. మృతదేహం జాడ లేక కర్మకాండ నిర్వహించలేక, మరణ ధ్రువీకరణ పత్రం లభించని పరిస్థితి ఉందని బంధువులు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement