ఒకర్ని కాపాడి.. ప్రాణం కోల్పోయిన ఆపద్బాంధవుడు | man who saved women at short circuit, dies | Sakshi
Sakshi News home page

ఒకర్ని కాపాడి.. ప్రాణం కోల్పోయిన ఆపద్బాంధవుడు

Published Sun, Jun 14 2015 1:11 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

man who saved women at short circuit, dies

దమ్మపేట: ఎదురింటికి చెందిన ఓ మహిళ విద్యుదాఘాతానికి గురైతే కాపాడబోయి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.  ఈ ఘటన ఖమ్మం జిల్లా దమ్మపేటలోని మోడల్ కాలనీలో ఆదివారం ఉదయం జరిగింది. వాసవి అనే మహిళ ఇంటి ముందున్న ఇనుప తీగపై బట్టలు ఆరేయబోగా, విద్యుత్ షాకుకు గురైంది.

 

ఎదురింట్లో ఉండే బాలకృష్ణ(23) అది చూసి వాసవిని తన లుంగీతో పక్కకు లాగాడు. ఆమె ఒక చేత్తో బాలకృష్ణను పట్టుకోవడంతో అతడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వాసవికి తీవ్ర గాయలు కాగా, ఆమెను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement