అపార్ట్‌మెంట్ నుంచి పడి మహిళ మృతి | woman suspious death | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్ నుంచి పడి మహిళ మృతి

Published Mon, Apr 27 2015 11:47 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

woman suspious death

పాల్వంచ (ఖమ్మం జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు మీది నుంచి పడి వివాహిత మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని నటరాజ్ సెంటర్ ఏరియాలోగల ఎస్‌కేపీ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో గల 1ఎ ఫ్లాట్‌లో కేటీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగి జిల్లెల యాదవరెడ్డి ఉంటున్నారు. ఆయన రెండవ కూతురు టైపు సంగీత (29) సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు పైకి ఎక్కి దూకింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందడంతో సీఐ షుకూర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్ కూకట్‌పల్లి నివాసికాగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2007లో వీరికి వివాహం కాగా ఐదేళ్ల జాహ్న అనే కూతురు ఉంది. 26 రోజుల క్రితం డెలివరీ నిమిత్తం పాల్వంచలోని తల్లిదండ్రుల ఇంటికి సంగీత వచ్చింది. మూడురోజుల్లో మరో కూతురికి జన్మనిచ్చింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాస్పదంగా మారింది.

అపార్ట్‌మెంట్‌లో రెండో ఘటన

8 నెలల క్రితం జ్యోతి (30) అనే వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇదే అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement