సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో త్వరలో జరగబోతున్న భారీ నియామక ప్రక్రియ ఏవిధంగా జరపాలన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పోలీస్ నియామక పరీక్షలు మొత్తం రిక్రూట్‌మెంట్ బోర్డు మాన్యువల్‌గానే నిర్వహిస్తూ వస్తోంది. అయితే టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న తరుణంలో కూడా ఇంకా ఇలా పరీక్షలు నిర్వహించడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆరోపణలు రావడం పోలీస్ శాఖను ఒత్తిడికి గురిచేస్తోంది. ఇలాంటి వాటికి చెక్‌పెట్టడంతో పాటు నిబద్ధతతో వ్యవహరించేందుకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.
లక్షల మందికి సాధ్యమేనా?
ప్రస్తుతం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, టీఎస్‌పీఎస్సీలు ఉద్యోగ నియామక ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ఎంట్రన్స్ పరీక్షలు సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికన్నా ఉద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇంతమందికి ఒకేసారి ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించడం, పలు రకాల ప్రశ్నపత్రాలను రూపొందించడం ఏకకాలంలో సాధ్యం అవుతుందా అన్న దానిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. 2015–16లో నిర్వహించిన నియామకాలకు 5 లక్షల మందికి పైగా ప్రిలిమ్స్ పరీక్ష రాశారు.
అందరికీ ఒకేసారి పరీక్ష నిర్వహించడం వల్ల ఒకేరకమైన ప్రశ్నపత్రం రూపొందించారు. కానీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించాలంటే పది నుంచి 15 రోజులపాటు సెషన్స్ రూపంలో జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో రైల్వే బోర్డు, ఇతర విభాగాలు నిర్వహించే ఆన్‌లైన్ ప్రక్రియను ఉన్నతాధికారులు అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది.
మాన్యువలా? ఆన్‌లైన్ ఎంట్రన్సా?
Published Tue, Apr 3 2018 2:48 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment