విధ్వంసానికి మావోయిస్టుల యత్నం | Maoist violence initiative | Sakshi
Sakshi News home page

విధ్వంసానికి మావోయిస్టుల యత్నం

Published Tue, Dec 30 2014 2:49 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Maoist violence initiative

  • తిప్పికొట్టిన పోలీసు బలగాలు
  • చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్‌ను పేల్చివేసేందుకు ఆదివారం రాత్రి మావోయిస్టు అగ్రనేతలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు 50 మంది మిలీషియా సభ్యు లు వచ్చారు. ముందస్తు సమాచారంతో ప్రత్యేక పోలీసు బలగాలు ప్రతిఘటించాయి. తొలుత మావోయిస్టులపైకి కాల్పులు జరిపారు.

    ప్రజలకు ఇబ్బంది తలెత్తకూడదని గాలిలోకి కాల్పులు జరిపి అప్రమత్తం చేశారు. పోలీసు చర్యతో మావోయిస్టులు పారి పోయారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తినష్టం తప్పింది. ఘటనాస్థలిలో మూడు తుపాకులు, విల్లంబులు, ప్రెటోల్‌బాటిళ్లు, మారణాయుధాలను మావోయిస్టులు వదిలి వెళ్లగా.. సోమవారం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement