sabotage
-
నా మనసు చెబుతోంది అది కుట్రేనని...
న్యూఢిల్లీ: ఆ మచ్చే లేకుంటే మహారాష్ట్ర కుస్తీ వీరుడు నర్సింగ్ యాదవ్ ‘డబుల్ ఒలింపియన్’ రెజ్లర్ అయ్యేవాడు. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు ముందు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో అతన్ని తప్పించడంతోపాటు నాలుగేళ్ల నిషేధం కూడా విధించారు. ఈ శిక్షాకాలం పూర్తవడంతో మళ్లీ కసరత్తు ప్రారంభించిన నర్సింగ్ తనకు జరిగింది ముమ్మాటికీ అన్యాయమనే వాపోతున్నాడు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఏ ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, తిన్న ఆహారం, తాగునీరు ద్వారానే తనను కావాలని ఇరికించి ఒలింపిక్స్ ఆశల్ని చిదిమేశారని విచారం వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లయినా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దోషులెవరనేది తేల్చలేదని అసహనం వ్యక్తం చేశాడు. (విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్) గతేడాది సీబీఐ ఈ కేసు విషయమై కోర్టుకు నివేదిక సమర్పించింది. ఉద్దేశ పూర్వకంగా రెజ్లర్‌ను ఇరికించినట్లు, కుట్ర జరిగినట్లుగా ఆధారాలేవీ లేవని అందులో పేర్కొంది. దీనిపై నర్సింగ్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ అధికారుల్ని నర్సింగ్ సంప్రదిస్తే విచారణ ఇంకా కొనసాగుతోందని సమాధానం వచ్చింది. ఎన్నో క్లిష్టమైన కేసుల్ని దర్యాప్తు చేసే సీబీఐ ఈ చిన్న కేసులో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదన్నాడు. తనపై తనకు నమ్మకముందని... నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. 31 ఏళ్ల రెజ్లర్ సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరానికి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉండగా... ఈ నెల 15 నుంచి శిబిరం మొదలవుతుంది. గతం గతః... పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో తనకు పోటీదారుడైన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘గతం గతః. దాన్ని ఇప్పుడు తొవ్వాలని అనుకోవడం లేదు. అయితే నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దనేదే నా అభిమతం’ అని అన్నాడు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ తన సత్తా నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. (బాక్సర్ సరితాదేవి ‘నెగెటివ్’) -
'విమానం గల్లంతు విద్రోహచర్య కాదేమో'
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్-32 అదృశ్యం వెనుక విద్రోహుల హస్తం ఉండకపోవచ్చని, అలా జరిగే అవకాశాలు చాలాచాలా తక్కువని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన గల్లంతైన విమానం ఆచూకీ కోసం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలను సభ్యులకు తెలిపారు. (ఆపరేషన్ తలాష్) ''ఆపరేషన్ తలాష్'ను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. ఇది విద్రోహ చర్య అయ్యే అవకాశాలు చాలా తక్కువ. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మందికి చెందిన కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం' అని పరీకర్ తెలిపారు. ఈ నెల 22న గల్లంతైన ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం గల్లంతై ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకు దాని జాడ తెలియక పోవడంతో అందులో ప్రయాణించిన నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. (భగవంతుడా మాకేంటీ కష్టం..!) విమానం గాలింపులో రోబోలు ఇప్పటికే వివిధ శాఖలు విమానం ఆచూకీ కోసం తలపెట్టిన 'ఆపరేషన్ తలాష్' లో నిమగ్నమయ్యాయి. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు. (చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం) బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. (విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం) -
శాస్త్రి భవన్లో మంటలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని శాస్త్రి భవన్లో సోమవారం సాయంత్రం ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో శాస్త్రి భవన్ నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పెట్రోలియం శాఖకు చెందిన అత్యంత కీలక లావాదేవీల, విధివిధానాల, వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలు ఇందులోనే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఈ పత్రాలన్నీ లీకయ్యాయని, వీటి వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలతో ప్రస్తుతం కేసులు నడుస్తున్న క్రమంలో అదే భవన్‌కు మంటలు అంటుకోవడం పెద్ద అనుమానానికి తావిస్తోంది. కావాలనే ఎవరో ఈ విధ్వంసక చర్యకు పాల్పడి ఉండొచ్చని, ఆ కోణాన్ని ఏ మాత్రం తోసిపుచ్చలేమని కూడా పోలీసులు చెప్తున్నారు. -
విధ్వంసానికి మావోయిస్టుల యత్నం
తిప్పికొట్టిన పోలీసు బలగాలు చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌ను పేల్చివేసేందుకు ఆదివారం రాత్రి మావోయిస్టు అగ్రనేతలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు 50 మంది మిలీషియా సభ్యు లు వచ్చారు. ముందస్తు సమాచారంతో ప్రత్యేక పోలీసు బలగాలు ప్రతిఘటించాయి. తొలుత మావోయిస్టులపైకి కాల్పులు జరిపారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకూడదని గాలిలోకి కాల్పులు జరిపి అప్రమత్తం చేశారు. పోలీసు చర్యతో మావోయిస్టులు పారి పోయారు. బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తినష్టం తప్పింది. ఘటనాస్థలిలో మూడు తుపాకులు, విల్లంబులు, ప్రెటోల్‌బాటిళ్లు, మారణాయుధాలను మావోయిస్టులు వదిలి వెళ్లగా.. సోమవారం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కొత్తపార్టీ నాటకంలో టీడీపీ పూర్తి సహకారం