బాలానగర్: మెదక్ జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారం పెద్దచెర్వులో ఈతకు వెళ్లి మామ, అల్లుడు నీట మునిగి మృతి చెందారు. శ్రీనివాస్(35), అతని సోదరి కుమారుడు అరవింద్(10) బుధవారం సాయంత్రం గ్రామ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు అరవింద్ మునిగిపోయాడు. అతనిని రక్షించే క్రమంలో శ్రీనివాస్ కూడా నీట మునిగి చనిపోయాడు. రెండు మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు.
ఈతకు వెళ్లి మామ, అల్లుడు మృతి
Published Wed, May 13 2015 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement