- ఉప్పల్ జయలీల పెట్రోల్ బంక్ బాగోతం
- మెషిన్‌లో చిప్ అమర్చి తూకంలో మోసం
- సీజ్ చేసిన తూనికల కొలతల అధికారులు
ఉప్పల్, న్యూస్‌లైన్: పెట్రోలు ఫిల్లింగ్ బాక్స్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ చిప్‌ను ఉపయోగించి కొలతలో మోసానికి పాల్పడుతున్న పెట్రోలు బంక్ బాగోతాన్ని అధికారులు బట్టబయలు చేశారు. ఉప్పల్ జయలీల ఫిల్లింగ్ స్టేషన్ లో తక్కువ కొలత వస్తుందని, పెట్రోలు నాణ్యతపై అనుమానం ఉందని కొందరు వినియోగదారులు తూనికల కొలతల శాఖాధికారులకు ఫిర్యాదు చే శారు.
తూ.కొ. విభాగం అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్‌రావు, జిల్లా ఇన్‌స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో బుధవారం జయలీల ఫిల్లింగ్ స్టేషన్‌పై దాడి చేశా రు. ప్రతి యంత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి లీటర్‌పై 2.18 నుంచి 2.30 ఎంఎల్ మేర పెట్రోల్ తక్కువగా వస్తుందని గుర్తించారు. ఫిల్లింగ్ బా క్స్‌లను విప్పి చూడగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని తేలింది.
పెట్రోల్ నాణ్యతను కూడా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకులోని అన్ని యంత్రాలను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెట్రోల్‌లో కల్లీ ఉందని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.