
కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి!
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో దించాలని ఏఐసీసీ భావిస్తోంది. పోటీకి పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నప్పటికీ సునీతను బరిలో ఉంచడం ద్వారా అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే ధీమాతో ఉంది. పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ రెండ్రోజులుగా మెదక్ జిల్లా నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీయే నిధులు సమకూర్చేతే సునీతకే టికెట్ ఇవ్వడమే మంచిదని జిల్లాలో మెజారిటీ నేతలు సూచించారు.