Sunita Laxma Reddy
-
మహిళలకు అన్నివిధాలా అండగా..
బన్సీలాల్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణలో మహిళలకు అన్నివిధాలా ధైర్యాన్ని, రక్షణను, భరోసాను కల్పించే దిశగా రాష్ట్ర మహిళా కమిషన్ ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహిళలకు అన్ని విధాలా రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని, మహిళా సాధికారతకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అనేక పథకాలు మహిళల సంక్షేమం కోసం ఇస్తున్నామంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారి పేరిటే ఇస్తున్నామని, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిం చామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒంటరి మహిళలను, బీడీ కార్మికులను ఆసరా పథకంలో చేర్చి పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. షీటీమ్స్ మహిళలకు రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. మహిళా చట్టాలపై అవగాహన రాష్ట్రంలో ప్రభుత్వం అనేక పథకాలను మహిళ పేరిట అమలు చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ అనేక సమస్యల నుంచి మహిళలకు విముక్తి కల్పించడంతోపాటు అన్ని విధాలా న్యాయం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళల కోసం రూపొందించిన చట్టాలు పకడ్బందీగా అమలు జరిగేలా కమిషన్ పనిచేస్తోందన్నారు. మహిళా చట్టాలపై మహిళలతోపాటు పురుషులకు కూడా అవగాహన కల్పిస్తామని, జిల్లాల్లో పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కమిషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించగా, సత్య వతి రాథోడ్ కమిషన్ లోగోను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యతోపాటు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. -
వీణవంక బాధితురాలికి పరామర్శ
కరీంనగర్: వీణవంక మండలం చల్లూరులో గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలిని బుధవారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పరామర్శిచారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. ఈ ఘటనపై మహిళా కమిషన్‌కు ఈ నెల 5న ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓ దళిత యువతిపై ముగ్గురు యువకులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టించిన విషయం తెలిసిందే. -
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నిమజ్జనం: సునీతా
మెదక్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ప్రజలు నిమజ్జనం చేయబోతున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని ఆమె విమర్శించారు. ఓటమి భయంతోనే నర్సాపూర్ లో భారీ సభకు ప్రయత్నాల్ని టీఆర్ఎస్ చేస్తోందని సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎన్ని గిమ్మక్కులు చేసినా.. కాంగ్రెస్ పార్టీదే విజయమని కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి!
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో దించాలని ఏఐసీసీ భావిస్తోంది. పోటీకి పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నప్పటికీ సునీతను బరిలో ఉంచడం ద్వారా అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే ధీమాతో ఉంది. పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ రెండ్రోజులుగా మెదక్ జిల్లా నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీయే నిధులు సమకూర్చేతే సునీతకే టికెట్ ఇవ్వడమే మంచిదని జిల్లాలో మెజారిటీ నేతలు సూచించారు. -
ఎన్నికైతే.. ఎన్ని కోట్లో..
నియోజకవర్గం : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) సునీతా లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి(కొడుకు) స్థిరాస్తులు రూ. 1.43 కోట్లు రూ. 1.80 లక్షలు చరాస్తులు రూ. 43.28 లక్షలు రూ. 1.50 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 1.86 కోట్లు రూ. 3.3 లక్షలు అప్పులు రూ. 1.55 లక్షలు - వాహనాలు: సునీతా రెడ్డి: స్కార్పియో (రూ.3 లక్షలు) నియోజకవర్గం : గజ్వేల్ ఎమ్మెల్యే టీ నర్సారెడ్డి (కాంగ్రెస్) టీ నర్సారెడ్డి మధు శ్రీ స్థిరాస్తులు రూ. 2.40 కోట్లు రూ. 2.43 కోట్లు చరాస్తులు రూ. 24.70 లక్షలు రూ. 39.37 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 2.64 కోట్లు రూ. 2.82 కోట్లు అప్పులు రూ. 5.07 లక్షలు రూ. 2.94 కోట్లు వాహనాలు: నర్సారెడ్డి : డస్టర్ కారు ( రూ.13 లక్షలు) భార్య : ఇన్నోవా (రూ.14.50 లక్షలు) నియోజకవర్గం : దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి చెరుకు ముత్యం రెడ్డి విజయలక్ష్మి (భార్య) స్థిరాస్తులు రూ. 1.23 కోట్లు రూ. 35 లక్షలు చరాస్తులు రూ. 23.45 లక్షలు రూ. 22.78 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 1.47 కోట్లు రూ. 57.78 లక్షలు అప్పులు రూ. 5 లక్షలు రూ. 11 లక్షలు వాహనాలు : ముత్యం రెడ్డి : మహేంద్ర క్వాంటో (రూ.9 లక్షలు), టాటా ఏస్ (రూ.4 లక్షలు), ట్రాక్టర్ (రూ.5.50 లక్షలు). భార్య: టాటా ఏస్ (రూ.4.50 లక్షలు). టీఆర్ఎస్ : సోలిపేట రామలింగం రెడ్డి ఎస్ రామలింగారెడ్డి భార్య స్థిరాస్తులు రూ. 7.2 లక్షలు రూ. 2.45 లక్షలు చరాస్తులు రూ. 18 లక్షలు రూ. 20 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 25.2 లక్షలు రూ. 22.45 లక్షలు అప్పులు రూ. 4.2 లక్షలు రూ. 2 లక్షలు వాహనాలు: రామలింగారెడ్డి : ఇన్నోవా (రూ. 6 లక్షలు), పల్సర్ (రూ. 40 వేలు) నియోజకవర్గం : అందోల్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ (కాంగ్రెస్) దామోదర పద్మిని(భార్య) స్థిరాస్తులు రూ. 4.30 కోట్లు రూ. 6 లక్షలు చరాస్తులు రూ. 22.75 లక్షలు రూ. 9.79 కోట్లు మొత్తం ఆస్తులు రూ. 4.53 కోట్లు రూ. 9.85 కోట్లు అప్పులు - - వాహనాలు: దామోదర : నిల్ పద్మిని : హుండాన్ (రూ.3.22 లక్షలు), ఫోక్స్‌వాగన్ (రూ.11.08 లక్షలు) మాజీ మంత్రి బాబూ మోహన్ (టీఆర్ఎస్) బాబు మోహన్ ఇందిర విజయలక్ష్మి స్థిరాస్తులు రూ. 80 లక్షలు రూ. 45 లక్షలు చరాస్తులు రూ. 6.81 లక్షలు రూ. 8.40 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 86.81 లక్షలు రూ. 53.41 లక్షలు అప్పులు - - నియోజకవర్గం: మెదక్ విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్(భర్త) స్థిరాస్తులు రూ. 27 కోట్లు రూ. 2.87 కోట్లు చరాస్తులు రూ. 70.61 లక్షలు - మొత్తం ఆస్తులు రూ. 27.70 కోట్లు రూ. 2.87 కోట్లు అప్పులు - - వాహనాలు : విజయశాంతి - టయోటా (రూ.5.89 లక్షలు) నియోజకవర్గం: సిద్దిపేట టీ హరీష్‌రావు శ్రీనిత (భార్య) స్థిరాస్తులు రూ. 45 లక్షలు చరాస్తులు రూ. 90.80 లక్షలు రూ. 1.60 కోట్లు మొత్తం ఆస్తులు రూ. 1.35 కోట్లు రూ. 1.60 కోట్లు అప్పులు - రూ. 1. 21 కోట్లు వాహనాలు : హరీష్ రావు ఇన్నోవా (రూ.16 లక్షలు) నియోజకవర్గం: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (కాంగ్రెస్) జగ్గారెడ్డి నిర్మలా రెడ్డి(భార్య స్థిరాస్తులు రూ. 44.59 కోట్లు - చరాస్తులు రూ. 54.38 లక్షలు రూ.19.15 లక్షలు మొత్తం ఆస్తులు రూ. 45.13 కోట్లు రూ. 19.15 లక్షలు అప్పులు - - వాహనాలు: జగ్గారెడ్డి : బీఎండబ్ల్యూ కారు( రూ.28 లక్షలు), టయోటా క్వాలీస్ (రూ.3 లక్షలు) -
హస్తినలో కుస్తీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోరాటాల పురిటిగడ్డ మెతుకుసీమ నేతలంతా తెలంగాణ కోసం హస్తినలో కుస్తీ పడుతున్నారు. సీమాంధ్ర నేతల దీక్షలు, లాబీయింగ్‌ల నేపథ్యంలో జిల్లా నేతలు కూడా ఢిల్లీకి మకాం మార్చారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట వారసత్వంతో మెదక్ జిల్లా ఆడబిడ్డలు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి తెలంగాణ కోసం మరోసారి తమ పోరాట పటిమను ప్రదర్శించారు. ఏకంగా ముఖ్యమంత్రి బస్సుకు అడ్డుపడి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జై తెలంగాణ నినాదాలతో ఢిల్లీ వీధులను హోరెత్తించారు. జిల్లా నేతలంతా ఢిల్లీలోనే సాధారణ ఎన్నికలు సమీపించడంతో పాటు తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరిన ప్రస్తుత సమయంలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నేతలంతా గట్టిపట్టుమీదనే ఉన్నారు. తెలంగాణ బిల్లును గట్టెక్కించి... తాము కూడా ఒడ్డున పడాలనే ప్రయత్నంలో మెతుకుసీమ నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, ఎంపీలు సురేష్ షెట్కార్, విజయశాంతి ఢిల్లీలో మకాం వేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో గట్టెక్కించేందుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఎవరి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా నేతలు బుధవారం ఏకంగా సీఎంనే అడ్డుకుని నిరసన తెలిపారు. హోరెత్తిన తెలంగాణ నినాదాలు ఢిల్లీలో ఇటు సీమాంధ్ర నేతలకు, అటు తెలంగాణ నేతలకు కామన్ షెల్టర్ గామా రిన ఏపీ భవన్లో తెలంగాణ నినాదం మార్మోగింది. బుధవారం ఇక్కడే తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ భవన్ నుంచి బస్సులో రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన సమయంలో జిల్లా మహిళా మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి మెరుపు వేగంతో ముఖ్యమంత్రి బస్సును అడ్డుకున్నారు. బస్సుకు అడ్డంగా పడుకున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నావంటూ కిరణ్‌ను నిలదీశారు. తెలంగాణను అనుకూలంగా నినాదాలు చేశారు. వారిద్దరినీ మిగిలిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు అనుసరించారు. తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు తేరుకొని వారిని నిలవరించే లోపే మంత్రులు సీఎంకు తెలపాల్సిన నిరసన తెలిపారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న పోలీసులు మంత్రులను బలవంతంగా ఈడ్చివేశారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళా మంత్రులు స్వల్పంగా గాయపడ్డట్టు తెలిసింది. -
నేటినుంచి దుర్గమ్మ శరన్నవరాత్రులు
పాపన్నపేట, న్యూస్‌లైన్: పరవళ్లు తొక్కుతున్న మంజీరా...పొంగిపొర్లుతున్న ఘనపురం...పచ్చని ప్రకృతి ఒడి లో శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. స్త్రీ, శి శు సంక్షేమశాఖ మంత్రి సునీతారెడ్డి, డీసీసీ అ ధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డిలు అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ పి. ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు తెలిపారు. ఏడుపాయల్లో 8 యేళ్ల క్రితం ప్రారంభమైన దేవిశరన్నవరాత్రోత్సవాలు ప్రతి యేట కన్నుల పండువగా జరుగుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షంతో ఘనపురం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుండగా, మంజీరమ్మ పరవళ్లు తొక్కుతూ అమ్మవారి ఆలయం ముం దునుంచి పరుగులు తీస్తూ జలకళ సోయగాలతో కనువిందు చేస్తుంది. నవరాత్రి ఉత్సవాలకు గో కుల్ షెడ్డును కళాతోరణాలతో... రంగు రం గుల విద్యుత్ దీపాలు, వస్త్రాలతో తీర్చిదిద్దారు. దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని వేద, పూజలతో శాస్త్రీయంగా గోకుల్ షెడ్డులోకి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9గంటలకు ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. సాయంత్రం వేళల్లో భజనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఏడుపాయలకు తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పాలకవర్గ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. -
సీమాంధ్ర నేతలకు ముందే తెలుసు: గీతారెడ్డి
-
విభజన గురించి వారికి ముందే తెలుసు: మంత్రి గీతారెడ్డి
ఇప్పుడు ఏకపక్ష నిర్ణయమనడం బాధాకరం సీఎం సహా ఎవరేం చేస్తున్నారన్న దానిపై హైకమాండ్ నిఘా ఉంది విభజన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున మేం భరోసా ఇస్తున్నాం ఇప్పుడు కాకపోయినా శీతాకాలంలో తెలంగాణ బిల్లు! ఫిబ్రవరి, మార్చికల్లా విభజన జరుగుతుంది నిర్ణయానికి ముందే సీమాంధ్ర నేతలు సోనియాను కలిశారు ఆ తర్వాతే సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రులకు విభజన గురించి ముందే తెలుసునని మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. విభజన నిర్ణయం వెలువడటానికి ముందే ఆయా నేతలంతా సోనియాగాంధీని కలిశారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్యమాలు, ఇతర పరిణామాలు, వాటి వెనుక ఎవరున్నారనే అంశాలపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా అందరిపైనా అధిష్టానం పెద్దలు కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, రాష్ర్టం విడిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున తాము భరోసా ఇస్తున్నామని చెప్పారు. మంత్రులు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విప్ అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏకపక్షంగా హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకుందన్న సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను గీతారెడ్డి తప్పుపట్టారు. ‘‘ఇది ఏకపక్ష నిర్ణయం కానేకాదు. విస్తృత చర్చలు, సంప్రదింపులు చేసిన తర్వాతే సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు విభజన నిర్ణయానికి ముందు కూడా సోనియాను కలిశారు. ‘మీ బాగోగులు మేం చూస్తాం. మీరు బాధపడాల్సిన పనిలేదు’ అని ఆయా నేతలకు సోనియాగాంధీ హామీ ఇచ్చిన తర్వాతే సీడబ్ల్యూసీలో, యూపీఏలో విభజనపై నిర్ణయం తీసుకున్నారు’’ అని వివరించారు. అయినా కొందరు నేతలు సోనియాగాంధీని కించపరచడం బాధాకరమన్నారు. విభజనపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తీర్మాన పత్రంపై సంతకాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘సీఎం అలా సంతకం చేసినట్లు నాకు తెలీదు. ఆయన తటస్థంగా వ్యవహరించారని అర్థమైంది. అయితే ఒక్కటి మాత్రం చెబుతున్నా. ఎవరైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, సీఎం సహా ఎవరేం చేస్తున్నారనే విషయంపై హైకమాండ్ నిఘా ఉంచింది. వాళ్లే తగిన చర్యలు తీసుకుంటారు..’’ అని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణపై ఎలా ముందుకు వెళ్లాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసునని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కాకపోయినా శీతాకాల సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్ర విభజన జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఎందులోనూ తీసిపోరు..: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసినందున హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమనో, ఇంకో రకంగా చేయాలనో వాదనలు సరికాదని మంత్రి గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లోకి ఎవరైనా బేషరతుగా రావచ్చని, అందరికీ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం పదవిలో మహిళలకు అవకాశమివ్వాలని కోరుతారా అని అడగ్గా... అది అప్రస్తుతమని, ఏదైనా అధిష్టానం నిర్ణయం ప్రకారమే ఉంటుందన్నారు. మహిళలు పురుషులకు దేనిలోనూ తీసిపోరని, యూపీఏ చైర్పర్సన్, లోక్‌సభ స్పీకర్‌తో సహ అనేక కీలక బాధ్యతల్లో మహిళలే ఉన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులు లేవనెత్తుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ‘‘మీరు ఇక్కడే ఉండొచ్చు. మేం ఉన్నాం. విభజన తర్వాత కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పార్టీ, ప్రభుత్వం తరఫున మీకు భరోసా ఇస్తున్నాం. మీ బాగోగులు మేం చూస్తాం. భద్రత కల్పిస్తాం. భావోద్వేగాలకు లోను కాకండి’’ అని చెప్పారు. ై హెదరాబాద్తోపాటు దేశ, విదేశాల్లో వ్యాపారం చేస్తున్న దిగ్గజాల్లో ఎంతో మంది సీమాంధ్రులున్నారని, వారు ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో సోనియాగాంధీపై అసభ్యకరంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి డీకే అరుణ చెప్పారు. మహిళను కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీ ఫొటోను ఓ పత్రికలో(సాక్షి కాదు) ప్రచురించడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో తల్లి, సోదరి ఒక మహిళ అనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. దీనివెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర తామని తెలిపారు.