ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నిమజ్జనం: సునీతా
మెదక్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ప్రజలు నిమజ్జనం చేయబోతున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని ఆమె విమర్శించారు. ఓటమి భయంతోనే నర్సాపూర్ లో భారీ సభకు ప్రయత్నాల్ని టీఆర్ఎస్ చేస్తోందని సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎన్ని గిమ్మక్కులు చేసినా.. కాంగ్రెస్ పార్టీదే విజయమని కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.