పరవళ్లు తొక్కుతున్న మంజీరా...పొంగిపొర్లుతున్న ఘనపురం...పచ్చని ప్రకృతి ఒడి లో శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
పాపన్నపేట, న్యూస్‌లైన్: పరవళ్లు తొక్కుతున్న మంజీరా...పొంగిపొర్లుతున్న ఘనపురం...పచ్చని ప్రకృతి ఒడి లో శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. స్త్రీ, శి శు సంక్షేమశాఖ మంత్రి సునీతారెడ్డి, డీసీసీ అ ధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డిలు అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ పి. ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు తెలిపారు. ఏడుపాయల్లో 8 యేళ్ల క్రితం ప్రారంభమైన దేవిశరన్నవరాత్రోత్సవాలు ప్రతి యేట కన్నుల పండువగా జరుగుతున్నాయి.
గురువారం కురిసిన భారీ వర్షంతో ఘనపురం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుండగా, మంజీరమ్మ పరవళ్లు తొక్కుతూ అమ్మవారి ఆలయం ముం దునుంచి పరుగులు తీస్తూ జలకళ సోయగాలతో కనువిందు చేస్తుంది. నవరాత్రి ఉత్సవాలకు గో కుల్ షెడ్డును కళాతోరణాలతో... రంగు రం గుల విద్యుత్ దీపాలు, వస్త్రాలతో తీర్చిదిద్దారు. దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని వేద, పూజలతో శాస్త్రీయంగా గోకుల్ షెడ్డులోకి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9గంటలకు ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. సాయంత్రం వేళల్లో భజనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఏడుపాయలకు తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పాలకవర్గ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు.