Papannapet
-
బోరుబావిలో పడిన బాలుడి మృతి
సాక్షి, మెదక్ : జిల్లాలోని పాపన్నపేట మండలం పొడిచన్పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్ సాయివర్ధన్ మృతి చెందాడు. 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అప్పుడే వేసిన బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలుడిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. 25 అడుగుల లోతులో బాలుడు ఉండొచ్చని భావించి, బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీశారు. కానీ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. (చదవండి : బోరుబావిలో బాలుడు) ప్రాణం మీదకు తెచ్చిన బోర్లు.. సాగు కోసం నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో భిక్షపతి తనకున్న పొలంలో బోర్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్గవి, నవీనాతోపాటు పిల్లలు పొలానికి వచ్చారు. మంగళవారం రాత్రి 160 ఫీట్ల వరకు ఒక బోరు వేయగా.. నీళ్లు పడలేదు. మళ్లీ వేరే స్థలంలో బుధవారం ఉదయం 300 ఫీట్ల వరకు వేశారు. అక్కడ కూడా నీరు పడకపోవడంతో చివరగా ఇంకో చోట 150 ఫీట్ల లోతు వరకు బోరుగుంత తవ్వినా.. ఫలితం లేకపోయింది. దీంతో వేసిన కేసింగ్ తీసేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇంటి బాట పట్టారు. తాత భిక్షపతితో కలసి బాలుడు సంజయ్ సాయివర్ధన్ వస్తున్నాడు. తాత కంటే ముందు వెళ్తున్న బాలుడు ప్రమాదవశాత్తు జారి బోరుగుంతలో పడిపోయాడు. మిన్నంటిన రోదనలు ఘటనా స్థలం వద్ద బాధిత బాలుడి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. బాలుడు సాయివర్ధన్ ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు. -
బోరుబావిలో బాలుడు
సాక్షి, మెదక్/పాపన్నపేట : వ్యవసాయ పొలంలో అప్పుడే వేసిన బోరుగుంత ఆ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. తాతతో కలసి బుడిబుడి అడుగులు వేస్తూ ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు రెప్పపాటులో బోరుగుంతలో పడిపోయాడు. లోపలికి వెళుతున్న క్రమంలో డాడీ.. డాడీ అంటూ రోదించిన తీరు కలచివేసింది. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్పల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగళి భిక్షపతి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు నవీన, భార్గవి. నవీనను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన గోవర్ధన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమారులు. ఇందులో చిన్నవాడైన సంజయ్ సాయివర్ధన్ (3) ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. ఫొట్రోగాఫర్ వృత్తితో కుటుంబాన్ని పోసిస్తున్న గోవర్ధన్ ఐదు నెలల క్రితం భార్య, పిల్లలను తన అత్తగారిల్లయిన పొడిచన్‌పల్లికి పంపించాడు. అప్పటి నుంచి నవీన తన పిల్లలతో ఇక్కడే ఉంటోంది. ప్రాణం మీదకు తెచ్చిన బోర్లు.. సాగు కోసం నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో భిక్షపతి తనకున్న పొలంలో బోర్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్గవి, నవీనాతోపాటు పిల్లలు పొలానికి వచ్చారు. మంగళవారం రాత్రి 160 ఫీట్ల వరకు ఒక బోరు వేయగా.. నీళ్లు పడలేదు. మళ్లీ వేరే స్థలంలో బుధవారం ఉదయం 300 ఫీట్ల వరకు వేశారు. అక్కడ కూడా నీరు పడకపోవడంతో చివరగా ఇంకో చోట 150 ఫీట్ల లోతు వరకు బోరుగుంత తవ్వినా.. ఫలితం లేకపోయింది. దీంతో వేసిన కేసింగ్ తీసేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇంటి బాట పట్టారు. తాత భిక్షపతితో కలసి బాలుడు సంజయ్ సాయివర్ధన్ వస్తున్నాడు. తాత కంటే ముందు వెళ్తున్న బాలుడు ప్రమాదవశాత్తు జారి బోరుగుంతలో పడిపోయాడు. సంఘటన స్థలంలో రోదిస్తున్న సంజయ్ తల్లి నవీన చీర, దోతి కట్టి లోపలికి వేసినా.. బాలుడు బోరుగుంతలో పడిన వెంటనే భిక్షపతి అయ్యో అయ్యో అంటూ ఏడవటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే చీర, దోతికి ముడేసి బోరుగుంత లోపలికి పంపారు. అయినా ఫలితం లేకపోయింది. నాలుగైదు నిమిషాలపాటు బాలుడు డాడీ.. డాడీ.. అంటూ ఏడ్చాడని.. ఆ తర్వాత ఏం వినబడలేదని కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక ఫైరింజన్, రెండు 108 వాహనాల్లో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని బోరుగుంతలోకి ఆక్సిజన్ పంపించారు. ముందుగానే చేరుకున్న రెండు జేసీబీలతో బోరుగుంతకు సమాంతరంగా తవ్వకం మొదలుపెట్టారు. రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. చిన్నారి తండ్రి గోవర్ధన్ 25 నుంచి 50 అడుగుల లోతులో ఉన్నట్లు.. బోరుబావిలో పడిన బాలుడు 25 నుంచి 50 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందం గుర్తించింది. బోరుబావి 150 అడుగుల లోతు ఉందని.. బోరుబావికి వినియోగించిన కేసింగ్ 40 అడుగుల వరకు మాత్రమే వేసినట్లు తెలుస్తోంది. అయితే నీళ్లు పడకపోవడంతో కేసింగ్‌ను తీసేశారని.. ఆ మేరకు బాలుడు కేసింగ్ వేసినంత దూరం వెళ్లి అక్కడ చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో బాలుడికి రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు నిర్వహణ ఫోర్స్) బృందం పొడిచన్‌పల్లికి చేరుకుంది. రెండో బృందం ఆంధ్రపదేశ్‌లోని గుంటూరు నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఫోన్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మిన్నంటిన రోదనలు ఘటనా స్థలం వద్ద బాధిత బాలుడి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. బాలుడు సాయివర్ధన్ ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు. -
బోరు బావి: 25 ఫీట్ల లోతులో సాయి వర్ధన్!
సాక్షి, మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలం పోడ్చన పల్లి గ్రామంలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. 120 అడుగులు లోతు తవ్వి నీళ్లు రావడం లేదని బోరు బావిని వదిలేసినట్టు స్థానికులు చెప్తున్నారు. బోరు సమీపంలో ఆడుకుంటూ వెళ్లిన సాయి వర్ధన్ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. మెదక్ రూరల్ ఎస్సై రాజశేఖర్, మరో ఎస్సై ఆంజనేయులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బలగాలను తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. బాలుడు పడిన బోరుబావిని ఈరోజు ఉదయమే తవ్వడం గమనార్హం. పొలం వద్దకు వెళ్లి.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన మంగలి గోవర్ధన్ నవీనల మూడో కుమారుడు సాయి వర్ధన్. నాలుగు నెలల క్రితం పోడ్చన పల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి గోవర్ధన్ కుటుంబ సమేతంగా వచ్చారు. మామ మంగలి బిక్షపతి చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కుటుంబ సమేతంగా చూడటానికి వెళ్లిన సమయంలో నీరులేని బోరు బావిలో సాయి వర్ధన్ పడిపోయాడు. కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడు క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రారంభంమైన సహాయక చర్యలు.. బోరుబావిలో పడిన సాయి వర్ధన్‌ను రక్షించేందుకు సహాయ చర్యలు మొదలయ్యాయి. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి, ఆడియో సాయిరాం, పాపన్నపేట తహసీల్దార్ బలరాం సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. రెండు జేసీబీలు, రెండు క్రేన్లు, మూడు అంబులెన్సులు, రెండు ఫైరింజన్లు ఘటనాస్థలం వద్ద సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు రావాల్సి ఉంది. 25 ఫీట్ల లోతులోనే చిన్నారి.. బోరుబావి లోతు 150 ఫీట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాయి వర్ధన్‌కు ఆక్సిజన్ అందించేందుకు పైపును బోరుబావిలోకి పంపిచగా.. 25 ఫీట్ల లోతులోనే ఆగిపోయినట్టు వెల్లడించారు. సాయివర్ధన్ 25 ఫీట్ల లోతులోనే ఉన్నట్టు ప్రాథమిక అంచనాకొచ్చినట్టు పేర్కొన్నారు. బోరుబావి చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో ఈ ఒక్కరోజే మూడు బోర్లు వేసి నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేసినట్టు తెలుస్తోంది. మే మాసంలో పోడ్చన్‌పల్లిలో ఇప్పటికే 19 బోర్లు వేశారని, వేటికీ అనుమతులు తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చిన్నారులు బోరుబావిలో పడిన ఘటనలు వరసగా.. 2008, 2011, 2015 సంవత్సరాల్లో మూడు చోటు చేసుకున్నాయి. అధికారులు ఎంత శ్రమించినా వారిని కాపాడలేకపోయారు. -
నిద్ర మత్తులో.. మృత్యు ఒడికి..
సాక్షి, పాపన్నపేట(మెదక్): స్నేహితుడికోసం తోడుగా వెళ్లిన ఓ యువకుడు.. బతుకుదెరువుకోసం బెడ్ షీట్లు అమ్ముకునేందుకు బయలు దేరిన మరో యువకుడి బతుకులు నిద్ర మత్తులో చిత్తయ్యాయి. రైస్‌మిల్ ఎదుట రోడ్డు పక్కనే ఆపిన ధాన్యం లారీలు.. యువకుల పాలిట శాపంగా మారాయి. వార్తా పత్రికలు తెచ్చేందుకు పట్నం వెళ్లిన యువకులు మరో అరగంటలో గమ్యం చేరుతారనగా.. కడతేరి పోయారు. నిల్చున్న లారీని ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు చనిపోగా.. మరో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంకో వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామశివారులోని సత్యసాయి రైస్‌మిల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు, బాధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కుర్మ భూపాల్(21) పదో తరగతి వరకు చదివి, ఆటో నడుపుతూ కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పాపన్నపేటకు చెందిన ఓ వ్యక్తి ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి దినపత్రికలు తేవడానికి తన ఆటోను నడుపుతున్నాడు. ఇందుకోసం పాపన్నపేటకు చెందిన తాటిగారి వంశీగౌడ్ను డ్రైవర్‌గా నియమించుకున్నాడు. అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు వంశీ తన మిత్రుడైన కుర్మ భూపాల్‌ను వెంట తీసుకెళ్లాడు. వీరిద్దరూ పేపర్లు తీసుకొని తిరిగి వస్తుండగా మెదక్‌లో గుల్బర్(22), అతిక్ రహమాన్ అనే బెడ్‌షీట్ వ్యాపారులు ఆటో ఎక్కారు. వీరు నలుగురు కలసి పాపన్నపేటకు వస్తుండగా, ఎల్లాపూర్ శివారులోని శ్రీ సత్యసాయి రైస్ మిల్ వద్ద ఎలాంటి హెచ్చరికలు.. ముందు జాగ్రత చర్యలు లేకుండా రోడ్డును ఆనుకొని ఆపి ఉంచిన లారీ(నెం.టీఎస్12యుపి 6593)నీ ఆటో ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు ఢీకొట్టింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న కొంతమంది అక్కడికి పరుగెత్తుకొచ్చి ఆటోలో ఉన్న యువకులను బయటకు తీశారు. ఈ సంఘటనలో ఆటో నడుపుతున్న కుర్మ భూపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు బెడ్ïÙట్లు అమ్మకునేందుకు వస్తున్న గుల్బర్ను 108లో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. తాటిగారి వంశీగౌడ్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో ప్రయాణికుడు అతిక్ రహమాన్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశామన్నారు. బతుకు పోరులో సమిధగా మారిన భూపాల్.. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కుర్మ దుర్గమ్మ, బేతయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు శంకర్ బతుకు దెరువుకోసం పట్నం వెళ్లగా తల్లి దుర్గమ్మ సైతం అక్కడే ఉంటుంది. వృద్ధుడైన బేతయ్యకు సపర్యలు చేస్తూ భూపాల్, చిన్న కొడుకు ప్రవీణ్‌లు రామతీర్థంలోఉంటున్నారు. ఆటో నడుపుతూ భూపాల్ బతుకు బండి లాగుతున్నాడు. ఇదే సమయంలో ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు కన్నీరు, మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతుడి ఇంటి వద్దకు చేరుకొని పెద్దపెట్టున విలపించారు. బతుకుదెరువుకోసం వచ్చి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నవర్డా గ్రామానికి చెందిన గుల్బర్(22)కుటుంబ సభ్యులతో కలసి పదేళ్ల క్రితం మెదక్‌కు వచ్చి, బెడ్షీట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాపన్నపేటో బెడ్ షీట్లు అమ్ముకునేందుకు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తన మిత్రుడు అతిక్ రహమాన్‌తో కలసి పాపన్నపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కి, ఎల్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. వ్యాపారం కోసం బయటకు వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు లబోదిబోమన్నారు. -
ఈసారి ఘనమేనా!
* రూ.కోటి నిధులపైనే కోటి ఆశలు * ఏర్పాట్లలో అధికారులు * 17 నుంచి ఏడుపాయల జాతర పాపన్నపేట: వెయ్యేళ్ల చరిత్ర గల ఏడుపాయల ఒకప్పుడు కీకారణ్యం. ప్రస్తుతం లక్షలాది భక్తులతో జనారణ్యంగా మారుతోంది. ఆదాయం ఘనంగా ఉన్నా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఎంతో ఇష్టంగా వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యాల మధ్య దైవ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. నదిలో పడి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు విడుదల చేశారు. కొంతలో కొంత బెటరేనని పలువురు అంటున్నారు. మాస్టర్ ప్లాన్ అమలైతేనే ఏడుపాయల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇలా.. ఏడుపాయల దుర్గా భవానీ మాత ఆలయ బడ్జెట్ గత ఏడాది రూ.1,82,42,201. ఇందులో రూ.1,72,38,084 ఖర్చు చేశారు. 46 మంది ఉద్యోగులుండగా సుమారు 42 శాతం ఆదాయం వారి జీతభత్యాలకే ఖర్చువుతోంది. సీజీఎఫ్, ఈఏఎఫ్, ఏడబ్ల్యుఎఫ్, అడిట్ ఫీ కలిసి సుమారు 21.5 శాతం వ్యయమవుతోంది. జాతర కోసం రూ.37 లక్షలు వెచ్చిస్తుంటారు. అమ్మవారి ఆదాయాన్ని పరిశీలిస్తే ఇప్పటివరకు రూ.85 లక్షల ఫిక్స్ డిపాజిట్లు ఉన్నాయి. కిలో 362 గ్రాముల బంగారు ఆభరణాలు, 102 కిలోల వెండి ఆభరణాలున్నాయి. వీటికితోడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన బంగారు కిరీటం, హారాలు ఉన్నాయి. భక్తుల సౌకర్యాల విషయానికొస్తే అంతంత మాత్రమే. సత్రాలన్నీ దాతలవే.. ఏడుపాయల్లో మొత్తం 46 సత్రాలు ఉండగా, అందులో 40 దాతలవే కావడం గమనార్హం. జాతర సమయంలో ఆ సత్రాలన్నీ దాతలతోనే నిండిపోతాయి. భక్తులు తలదాచుకోవడానికి బండరాళ్లు, చలువ పందిళ్లు, చెట్ల నీడలే దిక్కవుతున్నాయి. గత ఏడాది జాతర సమయంలో వర్షం పడటంతో భక్తుల అనేక అవస్థలు పడ్డారు. తలదాచుకోవడానికి చోటులేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీశారు. స్నానఘాట్లు లేకపోవడంతో గత ఐదేళ్లలో సుమారు 60 మంది భక్తులు మంజీర నదిలో స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయారు. తాగు నీటి పైప్లైన్లు మురికి నీటిలోనే తేలియాడుతున్నాయి. సత్రాల చుట్టూ చెత్తా చెదారం పేరుకుపోయింది. మహిళలకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో జాతర సమయంలో అవస్థలు పడుతున్నారు. ఇటీవల హుండి లెక్కింపులో కిందిస్థాయి ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించి సుమారు రూ.3 వేలు నొక్కేశారు. జాతర సమయంలో సైతం సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుంటారనే ఆరోపణలున్నాయి. టెండర్ హక్కులు పొందిన వారు కూడా పరిమితికి మించి రుసుం వసూలు చేస్తారని భక్తులు ఆరోపిస్తున్నారు. మద్యం సైతం జోరుగా విక్రయిస్తుంటారు. ఈసారి రూ.కోటితో ధూంధాంగా.. ఈనెల 17న ఏడుపాయల జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా వచ్చిన జాతర కోసం మునుపెన్నడూ లేని రీతిలో ధూంధాంగా జరిపించేందుకు అధికారులు, పాలకవర్గం ప్రత్యేక కృషి చేస్తోంది. భక్తులు స్నానాలు చేసేందుకు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని స్నానఘాట్లను నిర్మిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పించేందుకు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి 500 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏడుపాయలను సుందరంగా అలంకరించి జనం మెచ్చే జాతరగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి హరిత రెస్టారెంట్‌తోపాటు టూరిజం డార్మెటరీలు భక్తులకు కొంత ఉపయోగపడనున్నాయి. ఏడుపాయలకు సింగూర్ నీరు సంగారెడ్డి అర్బన్: ఏడుపాయల జాతరను పురస్కరించుకొని 0.30 టీఎంసీల నీటిని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసినట్టు సంగారెడ్డి నీటి పారుదల శాఖ ఈఈ రాములు తెలిపారు. దిగువకు నీటిని వదిలినందున నది పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ నీరు ఘనపూర్ ఆనకట్టకు ఆదివారం రాత్రికి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. -
మంజీరా తీరం.. హరితహారం
పాపన్నపేట: మంజీరా తీరం.. హరితహారంగా మారింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వెలవెలబోయిన పుడమితల్లి ఇటీవల కురిసిన వర్షాలతో హరితశోభను సంతరించుకుంది. పాపన్నపేట మండలంలో మంజీరమ్మ తల్లి సుమారు 35 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది. తీరప్రాంత రైతులు బోరు మోటార్లు ఏర్పాటు చేసుకుని తమ పంటలకు ప్రాణం పోస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవలేదు. మంజీరాలో వరదలు కనిపించలేదు. దీంతో రైతులు తుకాలు పోసేందుకు వెనకాడారు. అనంతరం జూలైలో కురిసిన తేలికపాటి వర్షాలు, సింగూర్ నుంచి విడుదలైన నీటితో తుకాలు పోసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మొదటివారంలో కురిసిన వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కింది. చెరువులు, కుంటల్లో కొంతమేర నీరు చేరింది. దీంతో వరినాట్లు ఓ మోస్తరుగా సాగాయి. సుమారు 12వేల ఎకరాల్లో వరిపంట వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్నిచోట్ల వరిపంటలు పొట్టదశకు వచ్చాయి. ముఖ్యంగా మండలంలోని లక్ష్మీనగర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, యూసుఫ్‌పేట, ఆరేపల్లి, మిన్పూర్, పాపన్నపేట, కొడుపాక, నాగ్సాన్పల్లి, గాజులగూడెం తదితర గ్రామాల్లో వరిపంటలు కళకళలాడుతోంది. మరో మూడు విడుతలు సింగూర్ నుంచి ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేస్తే ఖరీఫ్ గట్టెక్కె అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
‘పూడు’కున్న ఆశలు!
పాపన్నపేట/కొల్చారం, న్యూస్‌లైన్: మెతుకుసీమ పంటలకు ప్రాణాధారమైన ఘనపురం ప్రాజెక్టు పూడికతో నిండిపోయి రైతన్నల ఆశలు ఆవిరి చేస్తోంది. కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టులో భారీగా నల్లమట్టి చేరింది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోవడంతో చివరి ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి. పూడికతీతకు ప్రతిపాదనలు తయారుచేయాలని గత నెల 31న ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చినా.. అమలు జరిగేదెన్నడోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉపాధి హామీ పనుల కింద పూడికతీత పనులు చేపడితే ఉభయ ప్రయోజనాలు సమకూరే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1905లో నిజాం నవాబు కృషి మేరకు మంజీరా నదిపై పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఘనపురం ప్రాజెక్టు నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాజెక్టులో 0.2 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 42.80 కిలోమీటర్ల పొడవున్న మహబూబ్ నహర్, 12.80 కిలోమీటర్ల పొడవున్న ఫతే నహర్ కెనాళ్ల కింద 21,625 ఎకరాల సాగుభూమి ఉండేది. అప్పట్లో మంజీర నది ఏడాది పొడవునా ప్రవహిస్తుండటంతో ఆయకట్టు సస్యశామలంగా ఉండేది. కానీ, 1972లో సింగూర్ ప్రాజెక్టు నిర్మించాక ఘనపురం ప్రాజెక్టు పరిస్థితి ఘోరంగా మారింది. న్యాయంగా ప్రాజెక్టులోకి రావాల్సిన 4 టీఎంసీల నీరు పాలకుల దయాదాక్షిణ్యాల ఆధారంగా మారింది. గోటి చుట్టుమీద రోకటిపోటులా మంజీర వరదల వెంట తరలివచ్చిన నల్లమట్టి ఇసుకతో ఘనపురం ప్రాజెక్టు పూడికకు గురైంది. ఎంతో కష్టపడి సింగూర్ నుంచి విడుదల చేసుకున్న నీరు పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది. మత్తడి వద్ద పేరుకుపోయిన మట్టితో షట్టర్లు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచితే భూములు మునిగే అవకాశం ఉండటంతో నాటినుంచి పూడిక తీయాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా పూడిక తీస్తే అటు కూలీలకు, ఇటు రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. కాగా ప్రాజెక్టు మట్టి రైతుల పొలాల్లోకి ఉపయోగపడే అవకాశం ఉంది. కాగా ఇటీవల సందర్శించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాజెక్టు ఎత్తు, పూడికతీతపై సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఆనకట్టలో పూడికతీత పనులు మొక్కుబడిగా చేపట్టిన అధికారులు నాటినుంచి మరో మారు ఆ దిశగా చర్యలు చేపట్టిందిలేదు. ఆనకట్ట నుంచి పూడిక తీసినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు కాల్వలకు సక్రమంగా నీరందుతుంది. కాని అధికారులు పట్టించుకోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. వెంటనే పనులు మంజూరుచేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
పాపన్నపేట, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం గడ్డితో వెళుతున్న లారీ - ఆటో ఢీకొన్న సంఘటనలో మగ్గురు మృతి చెందగా, మరొకరు గా యపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. మెదక్ పట్టణం నుంచి ఓ ఆటో పాపన్నపేటకు ప్ర యాణికులతో వెళుతోంది. ఆటో పొడ్చన్‌పల్లి గ్రామ శివారులోకి రాగానే ముందు ఉన్న లారీ ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న గడ్డి లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న యూసుఫ్‌పేట గ్రామానికి చెందిన మూసపేట దేవయ్య (52), కొడుపాక గ్రామానికి చెందిన గుండారం సత్తమ్మ (62) కింద పడడంతో లారీ వీరిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న గుండారం సత్తమ్మ కూతురు కిష్టమ్మ, స్వరూప అనే మరో మహిళకు గాయాలు కావడంతో వీరిని 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయి తే కిష్టమ్మ పరిస్థితి విషయమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఆటో డ్రైవర్ మృతుడు మూసుపేట దేవయ్య కొడుకే అని తెలిసింది. మృతులు దేవయ్య, సత్తమ్మ, కిష్టమ్మలూ బంధువులేనని సమాచారం. పనిపైన వేర్వేరుగా మెదక్‌కు వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో ఒకే ఆటోలో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారు. సత్తమ్మ భర్త గతంలో మృతి చెందగా, ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో కిష్టమ్మ కూడా మృతిచెందింది. కాగా ఆటో డ్రైవర్ పారిపోయినట్లు తెలిసింది. విషయం తెలియగానే చుట్టు పక్కల వారు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అస్లాంఖాన్ తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి పటాన్చెరు టౌన్ : మండల పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. పటాన్చెరు ఎస్ఐ రాంప్రసాద్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండే లకీష్మప్రసన్న (20), శర్వాణిరెడ్డి, మంజు హర్షిత, మురళీలు నిజాంపేట విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కాగా బుధవారం సాయిమురళి జన్మదినం కావడంతో వారందరూ కారులో పటాన్చెరు వైపు వచ్చా రు. అందులో భాగంగానే భానూర్ నుంచి ముత్తంగి వైపు ఔటర్ రింగ్ రోడ్డుకు చెందిన సర్వీస్ రోడ్డు గుండా వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌కు ఢీకొట్టి పల్టీ కొట్టిం ది. ఈ ప్రమాదంలో లకిష్మ ప్రసన్న (20) అక్కడిక్కడే దుర్మరణం చెందగా శర్వణిరెడ్డి, మంజు హర్షిత, కారు నడుపుతున్న సాయిమురళిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరందరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. -
నేటినుంచి దుర్గమ్మ శరన్నవరాత్రులు
పాపన్నపేట, న్యూస్‌లైన్: పరవళ్లు తొక్కుతున్న మంజీరా...పొంగిపొర్లుతున్న ఘనపురం...పచ్చని ప్రకృతి ఒడి లో శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. స్త్రీ, శి శు సంక్షేమశాఖ మంత్రి సునీతారెడ్డి, డీసీసీ అ ధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డిలు అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ పి. ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు తెలిపారు. ఏడుపాయల్లో 8 యేళ్ల క్రితం ప్రారంభమైన దేవిశరన్నవరాత్రోత్సవాలు ప్రతి యేట కన్నుల పండువగా జరుగుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షంతో ఘనపురం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుండగా, మంజీరమ్మ పరవళ్లు తొక్కుతూ అమ్మవారి ఆలయం ముం దునుంచి పరుగులు తీస్తూ జలకళ సోయగాలతో కనువిందు చేస్తుంది. నవరాత్రి ఉత్సవాలకు గో కుల్ షెడ్డును కళాతోరణాలతో... రంగు రం గుల విద్యుత్ దీపాలు, వస్త్రాలతో తీర్చిదిద్దారు. దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని వేద, పూజలతో శాస్త్రీయంగా గోకుల్ షెడ్డులోకి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9గంటలకు ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. సాయంత్రం వేళల్లో భజనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఏడుపాయలకు తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పాలకవర్గ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు.