పాపన్నపేట, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం గడ్డితో వెళుతున్న లారీ - ఆటో ఢీకొన్న సంఘటనలో మగ్గురు మృతి చెందగా, మరొకరు గా యపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. మెదక్ పట్టణం నుంచి ఓ ఆటో పాపన్నపేటకు ప్ర యాణికులతో వెళుతోంది. ఆటో పొడ్చన్‌పల్లి గ్రామ శివారులోకి రాగానే ముందు ఉన్న లారీ ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న గడ్డి లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న యూసుఫ్‌పేట గ్రామానికి చెందిన మూసపేట దేవయ్య (52), కొడుపాక గ్రామానికి చెందిన గుండారం సత్తమ్మ (62) కింద పడడంతో లారీ వీరిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఆటోలో ఉన్న గుండారం సత్తమ్మ కూతురు కిష్టమ్మ, స్వరూప అనే మరో మహిళకు గాయాలు కావడంతో వీరిని 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయి తే కిష్టమ్మ పరిస్థితి విషయమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఆటో డ్రైవర్ మృతుడు మూసుపేట దేవయ్య కొడుకే అని తెలిసింది. మృతులు దేవయ్య, సత్తమ్మ, కిష్టమ్మలూ బంధువులేనని సమాచారం. పనిపైన వేర్వేరుగా మెదక్‌కు వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో ఒకే ఆటోలో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారు. సత్తమ్మ భర్త గతంలో మృతి చెందగా, ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో కిష్టమ్మ కూడా మృతిచెందింది. కాగా ఆటో డ్రైవర్ పారిపోయినట్లు తెలిసింది. విషయం తెలియగానే చుట్టు పక్కల వారు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అస్లాంఖాన్ తెలిపారు.
ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
పటాన్‌చెరు టౌన్ : మండల పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. పటాన్‌చెరు ఎస్‌ఐ రాంప్రసాద్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండే లకీష్మప్రసన్న (20), శర్వాణిరెడ్డి, మంజు హర్షిత, మురళీలు నిజాంపేట విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కాగా బుధవారం సాయిమురళి జన్మదినం కావడంతో వారందరూ కారులో పటాన్‌చెరు వైపు వచ్చా రు. అందులో భాగంగానే భానూర్ నుంచి ముత్తంగి వైపు ఔటర్ రింగ్ రోడ్డుకు చెందిన సర్వీస్ రోడ్డు గుండా వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌కు ఢీకొట్టి పల్టీ కొట్టిం ది. ఈ ప్రమాదంలో లకిష్మ ప్రసన్న (20) అక్కడిక్కడే దుర్మరణం చెందగా శర్వణిరెడ్డి, మంజు హర్షిత, కారు నడుపుతున్న సాయిమురళిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరందరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
Published Thu, Oct 10 2013 2:04 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement