నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం అంబం గ్రామానికి చెందిన పూజ(20) కవలలకు జన్మనిచ్చి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పూజ మరణించిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన మమత(28) అనారోగ్య సమస్యతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే సుమలత మరణించిం దని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడులను నిరసిస్తూ ఐఎంఏ, అప్నాల ఆధ్వర్యంలో ఆస్పత్రుల యాజమాన్యాలు మూడు రోజులు గా నిరసనకు దిగాయి. ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను మూసి ఉంచాయి. ఈ నిరసన కార్యక్రమాలు ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. మూడు రోజులుగా వైద్యసేవలు అందడం లేదు. సోమవారం ప్రభుత్వ వైద్యులు సైతం ఆందోళనల్లో భాగస్వాములు కావడంతో రోగులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలోనే 92 వరకు ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి.
ఈ ఆస్పత్రుల్లో రోజూ 500 వరకు ఔట్ పేషెంట్లు, 150 వరకు ఇన్‌పేషెం ట్లుగా సేవలు పొందుతుంటారు. ఆస్పత్రులను మూసి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులపై దాడులకు పాల్పడినవారిని అరెస్టు చేసేంతవరకు నిరసనలు తెలుపుతామని ప్రైవేట్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మూడు రోజులుగా వైద్యసంఘా లు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నాయి. మరో వైపు ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేయడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకులు ప్రైవేట్ ఆస్పత్రులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశారు.
నిబంధనలను తుంగలో తొక్కి..
ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కిటకిటలాడింది. రోజూ జిల్లా ఆస్పత్రికి 350 మంది ఔట్ పేషెంట్లు వచ్చేవారు. ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేయడం తో ఈ సంఖ్య 560కి చేరింది. ఈ సమయంలో రోగులకు అందుబాటులో ఉండి సేవలు అం దించాల్సిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ వైద్యుల తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం జిల్లా ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన ప్రభుత్వ వైద్యులు ఐఎంఏ, అప్నా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ముందు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
అటు ప్రైవేట్ ఆస్పత్రుల మూసివేత, ఇటు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు అందుబాటు లో లేకపోవడంతో రోగులు విలవిలలాడారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో జిల్లా ఆస్పత్రికి వచ్చినవారు నరకం చూశారు. ప్రభుత్వ వైద్యుల్లో దాదాపు అందరికీ ప్రైవేట్ ఆస్పత్రులు ఉండడం వల్లే నిబంధనలను లెక్కచేయకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఆస్ప త్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి పరిపాలన అధికారికి ఎలాంటి సమాచారం అందించకుండానే వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినవారికి వైద్యసేవలు అందించాల్సింది పోయి విధులు బహిష్కరించడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను జిల్లా ఆస్పత్రి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వైద్య విధాన పరిష త్, డీఎంఈ అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై నివేదిక కోరే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిలిచిన వైద్యసేవలు
Published Tue, May 27 2014 2:18 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement