
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాటి చింతమడక పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లలో ఎక్కడ రాజీపడలేదు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిదులు సమిష్టిగా సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేశారు.
ముఖ్యంగా గ్రామ ప్రజలను సభవేదికకు వచ్చేలా, గ్రామస్తులందరికీ భోజన ఏర్పాట్లు, సభ స్థలి నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా గ్రామ ప్రజలకు మాంస, శాఖాహార భోజనాలను వడ్డించారు. మరోవైపు అధికారులకు, మీడియా బృందానికి కూడా వేరువేరు షామీయానాల్లో భోజన వసతులు కల్పించారు. పక్కనే ఏర్పాటు చేసిన షామీయానాలో సీఎం కేసిఆర్‌కు భోజన ఏర్పాట్లు చేశారు.
నాటుకోడి లివర్ కర్రీతోపాటు మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫై, వైట్ రైస్, దాల్చా, పెరుగులను అందుబాటులో పెట్టారు. భోజనం అనంతరం సీఎం కేసిఆర్ కోద్ది ఆపీల్ ముక్కలు, కొద్దిపాటి నారింజ జూస్‌ను తీసుకున్నారు. సీఎంతో పాటు హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు ఫారుఖ్, రఘోత్తంరెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు కలిసి భోజనం చేశారు. వారికి భోజన ఏర్పాట్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శర్మలు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment