
రోడ్డు పక్కన పిల్లలతో కూర్చొన్న తల్లి
నిర్మల్: కరోనా మహమ్మారి కొందరి ప్రాణాలను కబలించడంతోపాటు ఎంతో మందికి ఉపాధిని దూరం చేసింది. ఫలితంగా కొన్ని కుటుంబాలు తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి. చిలుక జోస్యం చెప్పి జీవనం సాగించే ఓ కుటుంబం కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆదిలాబాద్ నుంచి బైక్‌పై కర్ణాటక రాష్ట్రంలోని సొంతూరుకు పయనమయ్యారు. మంగళవారం నిర్మల్ సమీపంలోకి రాగానే వాళ్ల బైక్ పంక్చర్ అయ్యింది. దీంతో ఇంటి యజమాని రోహిదాస్ బైక్‌ను బాగు చేసుకునేందుకు వెళ్లాడు. పిల్లలతో తల్లి రోడ్డు పక్కన కూర్చొని భర్త కోసం ఎదురుచూస్తోంది. –సాక్షి, ఫొటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment