'కొమురవెళ్లి మల్లన్న సాగర్‌గా తడ్కపల్లి రిజర్వాయర్‌' | minister harish rao statement on thadka palli reservoir | Sakshi
Sakshi News home page

'కొమురవెళ్లి మల్లన్న సాగర్‌గా తడ్కపల్లి రిజర్వాయర్‌'

Published Sun, Jun 14 2015 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

'కొమురవెళ్లి మల్లన్న సాగర్‌గా తడ్కపల్లి రిజర్వాయర్‌'

'కొమురవెళ్లి మల్లన్న సాగర్‌గా తడ్కపల్లి రిజర్వాయర్‌'

సిద్దిపేట (మెదక్): సిద్దిపేట మండలం తడ్కపల్లి శివారులో నిర్మించే రిజర్వాయర్‌కు రాష్ట్ర ప్రభుత్వం కొమురవెళ్లి మల్లన్న సాగర్‌గా నామకరణం చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. రూ. 3 వేల కోట్లతో రిజర్వాయర్‌ను నిర్మిస్తామని తెలిపారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో రూ. 2.60 కోట్లతో నిర్మించనున్న వైశ్య సదనం భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తడ్కపల్లిలో నిర్మించనున్న రిజర్వాయర్‌తో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణ పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసిందన్నారు. త్వరలో పనులను పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. త్వరలో సిద్దిపేట జిల్లాగా మారనుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement