యాలాల (రంగారెడ్డి) : గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా రవాణా మంత్రి మహేందర్ రెడ్డి తాను దత్తత తీసుకున్న ముద్దాయి గూడెంలో పర్యటించారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం ముద్దాయిగూడెం గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. గ్రామ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామంలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు.