
చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు సమీపంలోని దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింలును గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. దీంతో అతడు గాయపడి రోడ్డుపై పడిపోయాడు. సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి సబిత ప్రమాద విషయా న్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపి వ్యక్తి ని 108లోకి ఎక్కించారు. దామరగిద్ద సర్పంచ్‌కు సమాచారం అందించారు.