
కూకట్‌పల్లి: తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వి.శ్రీనివాస్‌గౌడ్ కూకట్‌పల్లి ప్రాంతీయులకు సుపరిచితులు. ఇక్కడి బాలాజీనగర్ కాలనీలో ఆయన మూడు దశాబ్దాలుగా నివాసముంటున్నారు. మున్సిపాలిటీలో ఉద్యోగం చేపట్టిన శ్రీనివాస్ గౌడ్..అంచలంచెలుగా ఎదిగి మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. కూకట్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఆయన ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేశారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్...బాలాజీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, స్థానికంగా దేవాలయం కమిటీ చైర్మన్‌గా ఇప్పటికీ సేవలందించటం విశేషం. ప్రస్తుతం శ్రీనివాస్‌గౌడ్‌కు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిపదవి లభించటంపై కూకట్‌పల్లి పరిసర ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment