టికెట్‌ కేటాయింపులో తొలగని ఉత్కంఠ ! | Ministers Contest For The Ticket, Vikarabad | Sakshi
Sakshi News home page

టికెట్‌ కేటాయింపులో తొలగని ఉత్కంఠ !

Published Thu, Nov 8 2018 1:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ministers Contest For The Ticket, Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇద్దరు మాజీ మంత్రులు టికెట్‌ కోసం పోటీ పడుతుండటం నియోజకవర్గ ప్రజలనే కాకుండా, జిల్లా ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ తప్పకుండా టికెట్‌ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఢిల్లీ స్థాయి నాయకులు టికెట్‌పై హామీ ఇవ్వడంతో వారంరోజుల క్రితం వికారాబాద్‌లో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి బలనిరూపణ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రశేఖర్‌వర్గం నాయకులు ఇదే చెబుతున్నారు. ఏదిఏమైనా వికారాబాద్‌ టికెట్‌ ఏసీఆర్‌కు వస్తుందని బరిలోనిలవడం ఖాయమంటున్నారు. పదిహేను రోజులుగా డిల్లీలోనే మకాం వేసిన ఏసీఆర్‌ కాంగ్రెస్‌ పెద్దలను కలిసి టికెట్‌ కోరుతున్నారు.

చంద్రశేఖర్‌ టికెట్‌ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో ప్రసాద్‌ కుమార్‌ కూడా రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు వికారాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ తనకే వస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్న ఆయన చంద్రశేఖర్‌ బైక్‌ ర్యాలీ తరువాత కొంత సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరపున ముందస్తుగానేప్రచారం ప్రారంభించిన ప్రసాద్‌ కుమార్‌ రెండు రోజుల క్రితం హూటాహూటీన డిల్లీ వెళ్లారు. కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఖాయం చేయడంతో ఇద్దరు మాజీ మంత్రులతో పాటు, నియోజకవర్గ కార్యకర్తలో టెన్షన్‌ నెలకొంది. స్క్రీనింగ్‌ కమిటీ తయారు చేసినజాబితాలో తమ పేరు ఉందాలేదాఅనే విషయంపై సన్నిత నాయకులతో ఆరా తీస్తున్నారు. ఏదిఏమైనా వికారాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది. మొత్తం మీద హస్తం ఎవరినివరిస్తుందోనని ఓటర్లు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

ఎక్కడ చూసినా అవే చర్చలు
నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ టికెట్‌పైనే చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరుమాజీ మంత్రులు పోటీ పడుతుండటంతోతీవ్ర చర్చకు దారితీస్తుంది. పట్టణంలోని ఓ హోటళ్లలో చూసినా, నలుగురు కూడిన చోట  కాంగ్రెస్‌ టికెట్‌పైనే చర్చించుకుంటున్నారు.గ్రామాల్లోని రచ్చబండల వద్ద, వ్యవసాయపొలాల వద్ద కూడా టికెట్ల చర్చనే జరుగుతుంది. ఓటర్లు ఎవరికివారు అంచానాలు వేస్తూ చివరిగా టికెట్‌ ఎవరికి దక్కుతుందో చెప్పేసుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌లోనూ అదే సీన్‌
నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించేవారి జాబితా చాలా ఉంది. ఇక్కడి నుంచి సుమారు పది మంది ద్వితీయ శ్రేణి నాయకులు  టికెట్‌ కోరుతున్నారు. అసెంబ్లీ రద్దు అయిన మొదట్లో ప్రతి రోజూ అధిష్టాం వద్దకు వెళ్లి టికెట్‌ కేటాయించాలని వేడుకుంటున్నారు. కాని టీఆర్‌ఎస్‌ అదిష్టానం  మాత్రం ఎవరికీ భరోసా ఇవ్వడంలేదు. అందుకు కారణం కాంగ్రెలో నెలకొన్న పోటీయేనని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశిస్తున్న ఇద్దరు మాజీ మంత్రుల్లో చంద్రశేఖర్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కితే  టీఆర్‌ఎస్‌ టికెట్‌ ప్రసాద్‌ కుమార్‌కు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ టికెట్‌ ప్రసాద్‌ కుమార్‌కే దక్కితే  ఇన్నాళ్లు పార్టీలో పనిచేసిన ఏదోఒక నాయకుడికి టికెట్‌ కేటాయించాలనే ఆలోచన చేస్తున్నట్లుతెలిసింది. ఏది ఏమైనా అధికార, ప్రతిపక్ష పార్టీల టికెట్‌ కేటాయింపు ప్రజలను ఆసక్తికి గురిచేస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement