సీబీఐ విచారణ అవసరం లేదు: కేసీఆర్‌ | Miyapur Land Scam Cm Kcr Review Meeting With Revenue Officers | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ అవసరం లేదు: కేసీఆర్‌

Published Tue, Jun 13 2017 9:55 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

సీబీఐ విచారణ అవసరం లేదు: కేసీఆర్‌ - Sakshi

సీబీఐ విచారణ అవసరం లేదు: కేసీఆర్‌

హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. భూ కుంభకోణం వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరం లేదని కేసీఆర్‌ తేల్చారు.

అసలు మియాపూర్‌లో భూకుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేసీఆర్‌ పేర్కొ‍న్నారు. అక్కడ ఎలాంటి కుంభకోణం జరగలేదని, విపక్షాలు ఈ వ్యవహారంలో రాజకీయాలు చేయడం తగదని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో భూముల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని మియాపూర్‌లో వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, దీని వెనుక పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement