ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థి.. వేలు నరుక్కున్న వీరాభిమాని | MLA candidate Gandra Satyanarayana fan cuts his finger | Sakshi
Sakshi News home page

ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థి.. వేలు నరుక్కున్న వీరాభిమాని

Published Wed, Dec 12 2018 7:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

MLA candidate Gandra Satyanarayana fan cuts his finger - Sakshi

సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో తాను ఎంతగానో అభిమానించే నేత ఓటమిపాలవ్వడం, మిగతా పార్టీకి చెందిన వారు హేళనగా మాట్లాడటం భరించలేక ఓ యువకుడు వేలు నరుక్కున్నాడు. ఈ సంఘటన చిట్యాల మండలంలోని జెడల్ పేట గ్రామం భీష్మానగర్‌లో చోటుచేసుకుంది.

భూపాలపల్లి నియోజవర్గంలో గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి 69,918 ఓట్లు సాధించి గెలుపొందారు. గండ్ర సత్యనారాయణ(సత్తన్న) ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున( టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా) పోటీ చేసి 54,283 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి 53,567 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

అయితే చిట్ల  మల్లేష్ అనే యువకుడు గండ్ర సత్యనారాయణ వీరభిమాని. సత్తన్న మీద అభిమానంతో మల్లేష్ బుధవారం టీషర్టు వేసుకుని తిరుగుతుండగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు ఎగతాళి చేశారు. ఇంకా సత్తన్న టీషర్ట్‌ వేసుకొని తిరుగుతున్నావా అంటూ హేళనగా మాట్లాడారు. దీంతో గ్రామస్తులందరూ చూస్తుండగానే సత్తన్న కోసం ప్రాణం అయినా ఇస్తా అంటూ గొడ్డలితో వేలునరుక్కున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement