టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని...
హన్మకొండ /వరంగల్ : టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం హన్మకొండ నక్కలగుట్టలోని చల్లా ధర్మారెడ్డి స్వగృహం ఎదుట తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఫ్), టీడీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చావు డప్పులు, చెప్పులు, చీపుర్లతో ధర్నా చేశారు. టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేడారపు సుధాకర్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల త్యాగాలు, శ్రమతో గెలిచి సిఎం కేసీఆర్ డబ్బు సంచులకు ఆశపడి చల్లా ధర్మారెడ్డి అమ్ముడు పోయారని ఆరోపించా రు. తల్లిలాంటి పార్టీని మోసం చేశారని ధ్వజమెత్తారు. శ్రీనివాస్, సుధాకర్, జాపాక రాజు, సతీష్, వెంకన్న ఆకుల రాంబాబు, సాంబయ్య, లింగాల మధు, సంతోష్, మణీ, రాజేశ్, వేణు, రౌతు రోహిత్, వంశీ, రమేశ్ పాల్గొన్నారు.
కాగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి ముందు చావుడప్పు ధర్మా చేసినందుకు హన్మకొండ డీఎస్పీ ఆదేశాల మేరకు సుబేదారి సీఐ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలిస్ స్టేష న్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న నేతలను జిల్లా పార్టీ అధ్యక్ష , కార్యదర్శులు ఎడబోయిన బస్వారెడ్డి, ఈగ మల్లేషం, ఉపాధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం పరామర్శించారు. బెయిలబుల్ కేసు పెట్టిన ట్లు సీఐ చెప్పినప్పటికి సాయంత్రం కండిషనల్ బెయిల్‌పై నాయకులను విడుదల చేశారు.