MLA Challa Dharmareddy
-
ప్రజలు మీసం తిప్పే రోజులు రావాలి
గీసుకొండ(పరకాల): ‘మా నాయకుడు మంచి పని చేశాడంటూ ప్రజలు మీసం తిప్పే రోజులు రావాలి.. అంతే కానీ ఎవరో ఓ నాయకుడు ఇంట్లో కూర్చుని అంతా నేనే అంటూ మీసం తిప్పడం సరికాదు. నేను పట్టుబడితే అభివృద్ధి కాదు.. విజయాలు వెనుక నడుచుకుంటూ రావాల్సిందే.. దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పోటీకి రండి చూసుకుందాం..’ అని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 2, 3, 4వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ధర్మారంలో ఏర్పాటు చేసిన సభలో మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని. ఎమ్మెల్యేకు లక్ష్మణుడిగా, ఆంజనేయుడిగా ఉంటానన్నారు. ఇటీవల మేయర్ నన్నపునేని నరేందర్ పలు సమావేశాలు, కార్యక్రమాలతోపాటు వాట్సప్ సందేశాల్లో సొంత పార్టీలోని ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో ధర్మారం సభలోనూ తన ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన ఆయన.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రశంసల జల్లు కురిపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను మేయర్ హోదాలో చల్లా ధర్మారెడ్డికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. నమ్ముకున్న వారికి అండగా నిలిచే స్వభావం చల్లా ధర్మారెడ్డిది అని తెలిపారు. 3వ డివిజన్లోని ధర్మారంలో పండ్ల మార్కెట్, హోల్‌సేల్ వ్యాపారుల మార్కెట్ వస్తోందని, ఇవే కాకుండా మండలంలో టెక్స్టైల్ పార్కు, జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం చేకూరుతుందని తెలిపారు. స్థానిక రైతులు భూములను అమ్ముకోవద్దని, రానున్న రోజుల్లో «భూమి ధర పెరిగే అవకాశం ఉందని అన్నారు. త్వరలో విలీన గ్రామాల ప్రజలకు సాదామైనామాల ద్వారా పట్టా చేసుకునే అవకాశం, గొర్ల పెంపంకందార్లకు యూనిట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరామని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. విలీన గ్రామాల్లో ఇప్పటికే రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగం మౌనిక, ల్యాదెల్ల బాలు, టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివ, గోలి రాజయ్య, మసూ ద్, జోషి, బిల్ల శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలీస్ ధర్మారావు, కార్యదర్శి పూండ్రు జయపాల్‌రెడ్డి, ‘నెక్’ ఉమ్మడి జిల్లా చైర్మన్ వీరగో ని రాజ్‌కుమార్, ఎంపీపీ ముంత కళావతి, మండ ల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మాధవరెడ్డి, ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సందెల సునీల్. జాగృతి నాయకులు పోలెబోయిన సాంబయ్య పాల్గొన్నారు. -
వరికోల్ శ్రీమంతుడు శ్రీనివాసరెడ్డి
పరకాల రూరల్: వరికోల్ గ్రామ ముద్దుబిడ్డ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికి శ్రీమంతుడని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వరికోల్ గ్రామంలో చేపడుతున్న శ్మశాన వాటిక పనులు, డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు, నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిæ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతర గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్డు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులను పీఆర్ డీఈ లింగారెడ్డి వివరించారు. గ్రామంలో ఈజీఎస్ ఆధ్వర్యంలో రూ.2.5కోట్ల పనులు చేపట్టగా 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గ్రామంలో ఆరు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యూస్ డీఈ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రూ1.53కోట్లతో 16.85 కిలో మీటర్ల పైపులైన్ నిర్మాణానికి 9 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ వరికోల్ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. గ్రామంలో చేపట్టిన రోడ్డు పనులు, సైడ్ డ్రైన్లు, గ్రామ పంచాయతీ భవనం, మిషన్‌భగీరధ పనులు మే 15వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పథకాల అమలులో స్థానిక ప్రజలు అధికారులకు గాని, నాయకలకు గాని ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దని అన్నారు. రాష్ట్రంలోనే తన గ్రామం ఆదర్శంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాని తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న 150 డబుల్ బెడ్ రూం ఇళ్లు రానున్న దసర పండుగ నాటికి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసే విధంగా పూర్తి చేయనున్నామన్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యడిగా ఎన్నికైన జోగినపల్లి సంతోష్‌కుమార్ నిధుల నుంచి రూ.కోటితో ఆధునిక హంగులతో ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వికలాంగ సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ రాజభద్రయ్య, కౌన్సిలర్ మడికొండ సంపత్, తహసీల్దార్ హరికృష్ణ నాయక్, ఎంపీడీఓ ఎం.శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు పాడి ప్రతాప్‌రెడ్డి, చందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరారీలో పగటి వేషగాళ్లు..
♦ ఎమ్మెల్యే కుటుంబం ఫిర్యాదుతో ♦ జ్యోతిష్యం కార్యాలయాల మూత పరకాల: మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతల పట్ల ఉన్న నమ్మకాన్ని ఆసరా చేసుకున్న కొందరు పగటి వేషగాళ్ల ఉచ్చులో అమాయక ప్రజలు చిక్కుకుంటున్నారు. ఫలితంగా వారికి వేలాది రూపాయలు సమర్పించుకుంటున్నారు. అయితే బాధిత కుటుంబాల్లో సాక్షాత్తు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబం ఒకటి కావడం సంచలనంగా మారింది. వాస్తవానికి కొయదొరల పేరిట రాష్ట్రంలోని అనేక జిల్లాలో మోసాలు జరుగుతున్న బయటకు రావడం లేదు. నాలుగైదు సంవత్సరాలుగా వీరి మోసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాము చేసిన తప్పుకు పశ్చాతాపం పడుతూ ఇలాంటి పరిస్థితి మరొకరికి రావొద్దని ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పగటి వేషాగాళ్లు పరారీలో ఉన్నారు. పరకాలలో జ్యోతిష్య కార్యాలయాలు కొయదొరల ముసుగులో పరకాల పట్టణంలో కొందరూ ఏకంగా కార్యాలయాలు తెరిచారు. కార్యాలయాల వద్ద ఆకర్షించే విధంగా ప్లెక్సీలు, సమాచారాన్ని ఏర్పాటు చేశారు. సమాచారంలో ఎలాంటి వ్యాధులైనా తమ వద్ద ఉన్న మూలికలతో నయం చేయడంతో పాటు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుతామని పేర్కొన్నారు. ఎదుటి వారి బలహీనతే ఆసరా.. కొయదొరల్లా కనిపించేల్లా వేషాలు వేసుకుని తెల్లవారుజామున 5గంటల సమయానికి కొందరు ద్విచక్రవాహనాలపై పట్టణంలోని ముందుగా అనుకున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఎవరు ఏ గ్రామానికి ..ఎక్కడికి వెళ్లాలో ముందే నిర్ణయించుకున్న విధంగా బయలుదేరుతారు. వారి బుట్టలో ఏవరైనా పడితే సమీపంలోని తమ జ్యోతిష్యకార్యాలయాలకు చేరుకోవాలని సూచి స్తారు. జ్యోతిష్యం ఉచితంగా చూస్తామంటునే జ్యోతిష్యం చూసే సమయంలో ఎదుటి వారి బలహీనతను ఆసరాగా చేసుకుని భవిష్యత్‌లో మీ కుటుంబంలో ఏదో కీడు జరుగపోతుందని చెప్పుతారు. దానికి కావాల్సిన మంత్రం మా గురువుల దగ్గర ఉంటుంది. యంత్రాలకు పూజలు చేయాలంటే కొంత ఖర్చు అవుతుందని నమ్మబలుకుతారు. ఫలితంగా భయంతో అమాయకుల నుంచి ఎంతటి వారైనా వారి వలలో చిక్కుకోవాల్సిందే. ప్రచారం కోసం వేలల్లో ఖర్చు జ్యోతిష్యం పేరిట కొందరు కేబుల్ టీవీలో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. వీరి ప్రచారాన్ని చూసిన ప్రజలు మోసపోతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిష్యం చూడటానికి డబ్బులు తీసుకునేది లేదంటునే నెలల కొద్ది టీవీల్లో ప్రచారం కోసం వేలాది రుపాయాల ఖర్చుచేస్తున్నారు. ఇంత డబ్బు వీరికి ఎక్కడి నుంచి వస్తుందంటే వీరి వలలో పడిన వారిదేనని తెలుస్తోంది. అయితే జ్యోతిష్యం పేరిట టీవీల్లో ప్రచారాలు వస్తున్న పోలీసు శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఎవరీ లక్ష్మణ్ రాజ్.. కొయదొరల్లో మూలిక వైద్యంలో పేరున్న వ్యక్తి లక్ష్మణ్‌రాజ్. తనను ఆశ్రయించి వారి రోగ నివారణ కోసం అడవిలోని మూలికలు సేకరించి నాటు వైద్యం చేసేవాడని, అతడు మృతి చెందన అనంతరం కూడా కొందరు లక్ష్మణ్‌రాజ్ పేరును వినియోగించుకుంటున్నట్లు సమాచారం. నగరంలోని కరీమాబాద్‌కు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి లక్ష్మణ్ రాజ్ పేరునే వినియోగించుకుంటున్నారు. హస్తం నర్సింగరావు, పాస్తరం రాజులు సైతం లక్ష్మణ్ రాజ్ పేరు చెప్పుకోవడం గమనార్హం. మోసం చేసిన కేసులో ఇద్దరి అరెస్ట్ వరంగల్: పూజల పేరిట డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులు పస్తం నర్సింహరాజు, పస్తం రాజులను అరెస్టు చేసినట్లు సుబేదారి సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి కూతురు సంరెడ్డి మానసరెడ్డి వద్ద కోయదొరల పేరుతో పూజల కోసం దఫాలుగా రూ.57లక్షలు వసూలు చేశారని తెలిపారు. మళ్లీ డబ్బులు కావాలని ఈనెల14వ తేదీన మానసరెడ్డిని అడగడంతో ఆమె మామ సంరెడిŠడ్ బాల్రెడ్డికి అనుమానం వచ్చి వీరి గురించి విచారించడంతో అసలు విషయం బయట పడిందన్నారు. కోడలు మానసరెడ్డి వద్ద పూజల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు బాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఆరెస్టు చేసిన నర్సింహరాజు, రాజుల వద్ద నుంచి డబ్బులు పూర్తిగా స్వాధీనం చేసుకొని కోర్టు హాజరు పర్చగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపినట్లు శ్రీనివాస్ తెలిపారు. -
పదవి కోసం పూజలు
కోయదొరలను ఆశ్రయించిన ఎమ్మెల్యే కూతురు - ఎనిమిది నెలల పాటు కొనసాగిన పూజలు - మూడు విడతల్లో రూ. 57 లక్షల అప్పగింత - సుబేదారి పోలీస్ స్టేషన్లో కోయదొరలపై కేసు నమోదు సాక్షి, వరంగల్: తండ్రిని ఎలాగైనా మంత్రిగా చూడాలని భావించి కోయదొరలు చెప్పిన పూజలు చేయించింది ఎమ్మెల్యే కూతురు. ఇందుకోసం అక్షరాలా రూ. 57 లక్షలు చెల్లించింది. ఖాతా లెక్కల్లో ఈ తేడాలు రావడంతో విషయం వెలుగు చూడగా.. వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన కూతురు మానసరెడ్డికి హైదరాబాద్‌కు చెందిన రాకేశ్‌రెడ్డితో విహాహమైంది. ఎమ్మెల్యే హన్మకొండలో ఉంటుండగా.. ఆమె అక్కడ ఉన్న సమయంలో నగరంలోని కరీమాబాద్‌కు చెందిన కోయ పూజారులుగా చెలామణి అవుతున్న పాస్తం నర్సింహరాజు అలియాస్ లక్ష్మణ్‌రాజు, పాస్తం రాజు అలియాస్ వంశీ కలిశారు. పూజలతో మీ కోరికలు నెరవేరుతాయనే ఆశలు కల్పించారు. దీంతో పూజలు చేయించేందుకు మానసరెడ్డి అంగీకరించారు. పరకాల ఎమ్మెల్యే అయిన తండ్రి చల్లా ధర్మారెడ్డికి మంత్రి పదవి రావాలనే లక్ష్యంతో 2016 నవంబర్ నుంచి కోయదొరల ఆధ్వర్యంలో పూజలు మొదలయ్యాయి. వరంగల్ నగరంలో పలు చోట్ల, వారణాశి వంటి ఇతర ప్రాంతాల్లో పూజలు కొనసాగాయి. ఈ క్రమంలో కోయదొరలుగా చెప్పుకున్న పాస్తం నర్సింహరాజు, పాస్తం రాజుకు మానసరెడ్డి మూడు విడతల్లో రూ. 57 లక్షలు చెల్లించారు. తండ్రికి చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి మానసరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ హోదాలో సెల్ఫ్ చెక్కు రాసుకుని, నగదు డ్రా చేసి చెల్లించినట్లు సమాచారం. కోయ దొరలు పూజలు నిర్వహించినా ఫలితం రాకపోవడం, మరోవైపు కంపెనీ ఖాతాల్లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. సుబేదారి ఠాణాలో కేసు.. కోయదొరల పూజలు, మంత్రి పదవి వంటి అంశాలు ఉండడంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వియ్యంకుడి ద్వారా ఫిర్యాదు చేయించారు. దీంతో పాస్తం నర్సింహరాజు, వంశీలపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జాతకాలను నమ్మొద్దు : ఎమ్మెల్యే చల్లా కోయదొరల మాయ మాటలు నమ్మి నా కూతురు పూజలు చేయించింది. గతంలో రెండు సార్లు నేను వారిని వెళ్లగొట్టాను. నేను లేని సమయంలో వారు ఇంటికి వచ్చి నా కూతురును నమ్మించారు. దీంతో రూ. 57 లక్షలు వారికి చెల్లించింది. ఈ విషయం నాకు తెలియడంతో పోలీస్ కేసు పెట్టాం. వారి నుంచి రూ.50 లక్షలు తిరిగి వచ్చాయి.మేము పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చినా.. జనాలకు మూఢ నమ్మకాలు వద్దనే విషయం కేసు పెట్టాను. నా పదవి కోసం పూజలు చేయడం అనేది అబద్ధం.కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కుమార్తె పూజలు చేసింది. -
ఎమ్మెల్యే ధర్మారెడ్డి రాజీనామా చేయాలని ధర్నా
హన్మకొండ /వరంగల్ : టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం హన్మకొండ నక్కలగుట్టలోని చల్లా ధర్మారెడ్డి స్వగృహం ఎదుట తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఫ్), టీడీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చావు డప్పులు, చెప్పులు, చీపుర్లతో ధర్నా చేశారు. టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేడారపు సుధాకర్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల త్యాగాలు, శ్రమతో గెలిచి సిఎం కేసీఆర్ డబ్బు సంచులకు ఆశపడి చల్లా ధర్మారెడ్డి అమ్ముడు పోయారని ఆరోపించా రు. తల్లిలాంటి పార్టీని మోసం చేశారని ధ్వజమెత్తారు. శ్రీనివాస్, సుధాకర్, జాపాక రాజు, సతీష్, వెంకన్న ఆకుల రాంబాబు, సాంబయ్య, లింగాల మధు, సంతోష్, మణీ, రాజేశ్, వేణు, రౌతు రోహిత్, వంశీ, రమేశ్ పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి ముందు చావుడప్పు ధర్మా చేసినందుకు హన్మకొండ డీఎస్పీ ఆదేశాల మేరకు సుబేదారి సీఐ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలిస్ స్టేష న్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న నేతలను జిల్లా పార్టీ అధ్యక్ష , కార్యదర్శులు ఎడబోయిన బస్వారెడ్డి, ఈగ మల్లేషం, ఉపాధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం పరామర్శించారు. బెయిలబుల్ కేసు పెట్టిన ట్లు సీఐ చెప్పినప్పటికి సాయంత్రం కండిషనల్ బెయిల్‌పై నాయకులను విడుదల చేశారు.