
మొట్లగూడెంలో భూములను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి : మండలంలోని కొప్పురాయి పంచాయతీ మొట్లగూడెం గ్రామాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన గిరిజనులకు అటవీ శాఖాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో జెడ్పీటీసీతో కలిసి శనివారం సందర్శించి గిరిజనులతో మాట్లాడారు.
రైతులు ఎవరూ భయపడొద్దని అందరికీ అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫారెస్టు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్కినేని సురేందర్‌రావు, నాయకులు కణతాల వసంతరావు, ఇస్లావత్ దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment