'టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడింది' | mlc election failure is trs failure, says chinna reddy | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడింది'

Published Thu, Mar 26 2015 12:06 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

'టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడింది' - Sakshi

'టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడింది'

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకతీతంగా ప్రజలు దేవీప్రసాద్ ను ఓడించి రామచంద్రరావును గెలిపించారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన జాప్యం చేయడం సరికాదన్నారు. ఏపీకి వెళ్లాల్సిన ఉద్యోగులు రాష్ట్రంలో లక్షా 45 వేలమంది ఉన్నారని తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించి ఏపీ ఉద్యోగులను  పంపించాలని, అదేవిధంగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని చిన్నారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement