మళ్లీ మొదటికే! | Modatike again! | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికే!

Published Wed, Nov 19 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

మళ్లీ మొదటికే!

మళ్లీ మొదటికే!

దరఖాస్తుల పునఃపరిశీలనకు  కలెక్టర్ ఆదేశం
 
సాక్షి, మహబూబ్‌నగర్: సామాజిక పింఛన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. పింఛన్లకు సంబంధించి జిల్లాలో భారీగా కోత పడింది. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయంగా, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో జాబితాను బయటపెట్టడంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది.  

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో భారీగా కోత పడడంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని తీరుపై సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ పింఛన్ల ప్రక్రియను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించి సామాజిక పింఛన్లు లభించే పరిస్థితి కనిపిం చడం లేదు..! వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితరులకు సం బంధించిన సామాజిక పింఛన్లను ప్ర భుత్వం పెద్దఎత్తున పెంచింది.

ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 1నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 అందజేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అర్హులకు మాత్రమే పింఛన్లు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం తాజా గా దరఖాస్తులు ఆహ్వానించింది. వాటి ని ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన సమ గ్ర కుటుంబ సర్వేతో పోల్చి అర్హులను తేల్చాలని నిర్ణయించింది. అయితే వాటిని అలుసుగా చేసుకొని అధికారులు పెద్దఎత్తున కోతలు విధించారు. చాలాచోట్ల అర్హులను కూడా వదిలేశా రు. దీనికి నిరసనగా కొన్ని రోజులుగా ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు జరుగుతున్నాయి.

 భారీగా కోతలు
 జిల్లాలో గతంలో 2,45,639  వృద్దాప్య పింఛన్లు, 1,30,718  వితంతు, 46,484 వికలాంగులు, 14,416 చేనేత, 1,408 గీత కార్మికుల, 20,771 అభయహస్తం ఇలా మొత్తం 4,59,436  మంది పింఛన్లు తీసుకునే వారు. తాజా దరఖాస్తుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అ న్ని రకాల పింఛన్ల కోసం జిల్లాలో మొ త్తం 5,55,662 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు అర్హులుగా 3,10,000 తేల్చినప్పటికీ,  కేవ లం 1,58,500 మందిని మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

గతంతో పోల్చితే పింఛన్ల అర్హుల సంఖ్య భారీగా కో త పడింది. గతంతో పోల్చితే లక్షకు పైగా కోత పడింది. అలాగే ఆన్‌లైన్‌లో అతి తక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పింఛన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీడీఓలతో సమావేశమైన కలెక్టర్
మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగళవారం ఎంపీడీఓలతో జి ల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బండమీదిపల్లిలోని శిక్షణా కేంద్రంలో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. వివిధ కారణా ల చేత తిరస్కరించిన పింఛన్ల దరఖాస్తులన్నీ పున:పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన 17 జీఓలోని నిబంధనల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్ లభించేటట్లు చూడాలని స్పష్టం చేశారు.

అలాగే పింఛన్లు మంజూరు చేయడంలో పూర్తి నిర్ణయాధికారం విచారణ అధికారులకే ఉందని, అయితే మంజూరు చేసిన ప్రతి పింఛన్‌కు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.
 
 తిరస్కరించిన పింఛన్లను జాగ్రత్తగా పరిశీలించాలి
 
 మహబూబ్‌నగర్ టౌన్ : తిరస్కరంచిన పింఛన్లను జాగ్రత్తగా పునపరిశీలించాలని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ఎంపీడీఓలను సూచించారు. మంగళవారం బండమీదిపల్లిలోని శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఎంపీడీఓల సమావేశంలో కలెక్టర్ మట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్క లబ్దిదారునికి అన్యాయం జరగరాదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన 17 జీఓ లోని నిబంధనల ప్రకారం పింఛన్లు మంజురు చేయాలని ఆదేశించారు.

పింఛన్ల మంజూరులో పూర్తిన్ణియాధికారం విచారణ అధికారులకే ఉందని, అయితే మంజురు చేసిన ప్రతి పించన్‌కు వారే బాధ్యత వహించాలన్నారు. వివిధ కారణాల చేత తిరస్కరించిన పింఛన్ల దరఖాస్తులన్నింటినీ పున పరిశీలించాలని కోరారు. జిల్లాలోని ఇప్పటి వరకు 2. 97 లక్షల దరఖాస్తులు డాటా ఎంట్రీ చేయగా, దాదాపు 2. 93 దరఖాస్తులను పింఛన్‌కు అనుమతించామన్నారు.

డాటా ఎంట్రీ సందర్భంగా తప్పులు దొర్లిన వాటిని, అలాగే వయస్సు, ఇతర కారణాల చేత సందేహంతో పెండింగ్‌లో ఉంచిన పింఛన్ దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వివరణ అందిన వెంటనే జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, డీఆర్‌డీఏ ఏపీఓ శారద, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement