హైదరాబాద్ : న్యూనల్లకుంటలోని కొత్త రామాలయం వీధిలో రోజు రోజుకూ కోతుల బెడద అధికమవుతోంది. వీధుల్లో వృద్ధులు, పిల్లలు కనిపిస్తే చాలు దాడిచేసి గాయపరుస్తున్నాయి. అదే విధంగా ఇళ్లల్లోకిదూరి ఆహార పదార్థాలు ఆరగించి వెళ్లిపోతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళలు కోతుల కారణంగా భయంతో వణికిపోతున్నారు.
శనివారం మధ్యాహ్నం ఓ మహిళ తమ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం కొత్త రామాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా దాదాపు 15 కోతులు ఆమెపై దాడి చేసి గాయపరిచాయి. న్యూనల్లకుంటలో రోజు రోజుకు కోతుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని, ఈ సమస్యపై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోతులదాడిలో మహిళకు గాయాలు
Published Sat, Apr 25 2015 6:50 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement