నల్గొండ:జిల్లాలోని నార్కెట్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో విభేదాల కారణంగా ఓ తల్లి తన పిల్లలకు విషమిచ్చిన ఘటన ఆదివారం స్థానికంగా కలకలం సృష్టించింది. పిల్లలకు ఆలనా పాలనా చూడాల్సిన తల్లే.. పిల్లలపాలిట యమపాశంలా మారింది. పేగు బంధాన్నిమరచిన తల్లి.. పిల్లలపై విషప్రయోగం చేసింది. ఈ ఘటనలో పెద్ద కుమార్తె దీపిక(4) మృతి చెందగా, మరో కూతురి పరిస్థితి విషమంగా ఉంది.
గత కొంతకాలంగా పిల్లల కారణంగా ఆమెకు ప్రియునికి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో తన ఇద్దరి పిలల్ని అంతమొందిచాలనుకుని విష ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది.