మున్సిపాలిటీల్లో మే లోగా ‘బహిరంగ’ నిర్మూలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలి టీలను మేలోగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని, చైతన్యం పెంపొందించే కార్య క్రమాలను చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం మరింత దృష్టి సారిం చాలన్నారు. పురపాలక శాఖ పరిధిలోని పురపాలక శాఖ డైరెక్టరేట్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెట్రో రైలు, జల మండలి విభాగాల అధిపతులతో కేటీఆర్ గురువా రం హైదరాబాద్‌లో సమీక్షిం చారు. వార్షిక ప్రణాళిక రూపక ల్పనను వేగవంతం చేయాలని అన్ని విభాగాలను ఆదేశించారు. పురపాలక శాఖ లోని విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, తరచూ సమావేశమై ఆదర్శ పద్ధతులను పంచుకో వాలని సూచించారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో చెత్త సేకరణ ఆటోలను పంపిణీ చేయాలని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేయాలని పురపాలక శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్‌లో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తామని కేటీఆర్ తెలిపారు. గోడ మీద రాతలు, వాల్ పోస్టర్లు అతికించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాపూ ఘాట్ వద్ద మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులతోపాటు కోత్వాల్ గూడలోని ఎకో పార్కు ప్రాజెక్టు పనులకు గడువు నిర్దేశించుకుని ఆలోగా పనులు పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను కేటీఆర్ ఆదేశించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీఏ ప్రాజెక్టుల రూపకల్పన జరపాలన్నారు. డీటీసీపీ విభాగంలో ఈ–ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తున్నామని అధికారులు మంత్రికి నివేదించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక ప్రాజెక్టులో భాగంగా కొత్తగూడెం జిల్లా అభివృద్ధి ప్రణాళికను పైలట్ ప్రాజెక్టుగా రూపొందించను న్నామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని హెచ్‌ఎంఆర్ అధికారులను మంత్రి ఆదేశించారు.