గిరిజన మహిళలతో బతుకమ్మ ఆడుతున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
సాక్షి, జనగామ: తెలంగాణను ఎడారిగా మార్చిన ఆంధ్ర పాలకుల చేతుల నుంచి విముక్తి పొందిన తర్వాతే మన పాలనలో మనమే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నామని తాజా మాజీ ఎమ్మెల్యే ము త్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గం సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు హనుమతండా, పంతులు తండా, రెడ్యా నాయక్ తండా, కొండాపూర్, కూటిగల్ గ్రామాల్లో ముత్తిరెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మహిళలు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టగా... వారితో కలిసి కోలాటం, బతుకమ్మ ఆడారు. అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పల్లెలన్ని బాగుపడ్డాయన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందన్నారు. గత ఏడాది రూ.350 కోట్ల పంట దిగుబడి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. తండావాసులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గ్రామపంచాయతీల కలను నెరవేర్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment