muttireddy yadagiri reddy
-
ఫలించిన కేటీఆర్ ప్లాన్.. సీనియర్ నేతకు టికెట్ ఫిక్స్
సాక్షి, వరంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. కాగా, ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, బీఆర్ఎస్లో సీట్ల పంచాయితీపై ఇంకా కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు సందర్భంగా దొరికిన ప్రతీసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. నేతల మధ్య సయోధ్య కుదురుస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ఇద్దరు నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జనగామ సీటును పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేటాయించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడి యాదగిరిరెడ్డితో చర్చించారు. వీరి మధ్య సయోద్య కుదిర్చి జనగామ స్థానాన్ని పల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ముత్తిరెడ్డికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక, జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని స్థానిక నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు కలిసి పని చేయాలని ముత్తిరెడ్డి సైతం పిలుపునిచ్చారు. మరోవైపు.. జనగామ సీటు ఖరారు కావడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేడు కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ఇదే జోష్‌లో ఈనెల 16న కేసీఆర్ నేతృత్వంలో జనగామలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఈ సభ ఏర్పాట్లను నేడు మంత్రి హరీష్ రావుతో కలిసి పల్లా పర్యవేక్షించనున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వైపు.. తండ్రి కొడుకుల చూపు? -
‘కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు’
సాక్షి, జనగామ: ‘పార్టీలో పదవులు రాలేదని చీటికిమాటికి కొట్లాటలు వద్దు. ఉద్యమ సమయం నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన. అయినా నిన్నకాక మొన్న టీఆర్ఎస్లో చేరిన వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీనికి నేనేమైనా కొట్లాట చేశానా? అన్నింటికీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉంది’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట, పాలకుర్తి, ఉప్పల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్‌ను నమ్ము కోవడంతో జనగామ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. మనకు మనం మనస్పర్థలకు వెళ్లి, పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని హితవు పలికారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పినోళ్లకే పథకాలు వస్తాయని, కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు దక్కు తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఇప్పటికే జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కి కరోనా సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్ బయల్దేరారు. (హైదరాబాద్‌లో దడ పుట్టిస్తున్న కరోనా) కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో వారం కిందటే బాజిరెడ్డి ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారు. అంతేకాకుండా మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నిన్న బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో బాజిరెడ్డికి పాజిటివ్, భార్యకు నెగెటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే కుటుంబసభ్యులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్) ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలు సేకరణ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్ అయినవారి వివరాలను వైద్యాధికారులు, సిబ్బంది సేకరిస్తున్నారు. డిచ్పల్లి మండలం బీబీపూర్ తండాలో నిన్న (శనివారం) డబుల్ బెడ్రూం ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. 50 గృహాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వారికి ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దీంతో ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్ఎస్లోనే: ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: తాను బీజేపీలోకి వెళ్తున్నానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్ఎస్లోనే ఉంటానని, కేసీఆర్ వెంటే నడుస్తానని ఆయన చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తాను ఉద్యమంలోనూ ఉన్నానని, భవిష్యత్‌లోనూ కేసీఆర్ వెంటే ఉంటానని తెలిపారు. -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అవయవదానం
చేర్యాల (సిద్దిపేట)/జనగామ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 65వ జన్మదినం సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అవయవదానానికి ముందు కొచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలోని దుర్గామాత సాక్షిగా అవయవదానం చేస్తున్నట్లు సంతకం చేసిన పత్రాలను వైద్యులకు అందజేశారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యస భ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌లు ఇచ్చిన పిలుపు మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరణించిన తర్వాత పనిచేసే అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభాగ్యులకు అందించి నూరేళ్ల ఆయుష్షును అందించాలని విజ్ఞప్తి చేశారు. అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో నడిపించిన సీఎం కేసీఆర్ పాత్ర దేశ రాజకీయాల్లో కీలకం కానుందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని విధాలుగా అర్హులని పేర్కొన్నారు. కేటీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పొన్నాలను ప్రజలే వద్దంటున్నారు
సాక్షి, జనగామ: జనగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని పొన్నాల లక్ష్మయ్యను నియోజకవర్గ ప్రజలు అభ్యర్థిత్వం ఖరారు కాకముందే నిరాకరిస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ మండలంలోని గోపిరాజుపల్లి, పెద్దపహాడ్, ఎర్రగుంటతండా, కళ్యాన్ నగర్, దుబ్బతండాలో శనివారం ముత్తిరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు కోలాటంతో బ్రహ్మరథం పట్టారు. అనంతరం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ మూడు సార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ప్రజలకు అవసరమయ్యే ఏ ఒక్క పని చేయలేదని ఆరోపించారు. గోదావరి నీటిని తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని, నీటిని పంపింగ్ చేసే డ్యాం వద్ద తక్కువ వోల్టేజీ మోటార్లను బిగించడంతో మన ప్రాంతం ఎడారిగా మారిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందగానే సీఎం కేసీఆర్‌తో కొట్లాడి దేవాదుల ప్రాజెక్టు వద్ద మోటార్ల సామర్థ్యం పెంచి, చెరువులకు సరిపడా నీటిని మళ్లించామన్నారు. గత మూడేళ్లుగా పంట ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. జనగామ చరిత్రలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ఎమ్మెల్యేను తాను మాత్రమేనన్నారు. నాలుగున్నరేళ్ల పాటు కనిపించని పొన్నాల లక్ష్మయ్య ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యారని దుయ్యబట్టారు. కాగా కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరగా, ముత్తిరెడ్డి వారిని స్వాగతించారు. ప్రతిచోట ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ వారిచే హామీ తీసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాల్దె సిద్ధిలింగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల కలింగరాజు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్ కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భూక్యా శంకర్ నాయక్, యువజన నాయకులు నీల రామ్మోహన్, ఆయా గ్రామాల నాయకులు పురేందర్‌రెడ్డి, రాజేశ్వర్, దండు సిద్ధులు, రవి, ఖలీల్, దేవేందర్‌రెడ్డి, దేవ్‌సింగ్, భూక్యా భాస్కర్, నర్పింహ, మాలోతు సక్రు, సిద్ధులు, నాగరాజు, రంగ, గంగ, ఆగయ్య ఉన్నారు. -
మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుంటున్నం
సాక్షి, జనగామ: తెలంగాణను ఎడారిగా మార్చిన ఆంధ్ర పాలకుల చేతుల నుంచి విముక్తి పొందిన తర్వాతే మన పాలనలో మనమే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నామని తాజా మాజీ ఎమ్మెల్యే ము త్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గం సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు హనుమతండా, పంతులు తండా, రెడ్యా నాయక్ తండా, కొండాపూర్, కూటిగల్ గ్రామాల్లో ముత్తిరెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టగా... వారితో కలిసి కోలాటం, బతుకమ్మ ఆడారు. అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పల్లెలన్ని బాగుపడ్డాయన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందన్నారు. గత ఏడాది రూ.350 కోట్ల పంట దిగుబడి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. తండావాసులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గ్రామపంచాయతీల కలను నెరవేర్చామన్నారు. -
లోకల్ చంటికే.. సీటు
సాక్షి ప్రతినిధి, వరంగల్: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతల్లో అప్పుడే హడావుడి మొదలైంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయా, వేర్వేరుగా జరుగుతాయా అనే అంశంతో సంబంధం లేకుండా నాయకులు ఊళ్ల బాటపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం కీలకంగా ఉంటుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత తమదేనంటూ అన్ని పార్టీల నేతలూ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ‘స్థానిక’ అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. పునర్విభజన తర్వాత తొలిసారిగా జరిగిన గత ఎన్నికల సమయంలో రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర నియోజకవర్గాలకు వలస వెళ్లిన నాయకులకు ఇప్పుడు ‘స్థానిక’ అంశం సవాలుగా మారుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత పార్టీ శ్రేణుల నుంచి.. స్థానికులకే సీట్లు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ... ఇలా అన్ని పార్టీల్లోనూ ఇది మొదలైంది. ఈ స్థానికత సమస్య సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాస్త తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయి.. మళ్లీ పోటీ చేయూలనుకునే వారికి, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారికి మాత్రం ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లు తెలంగాణ అంశం ఎన్నికల్లో ఇబ్బందిగా ఉండేది. ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని చెబుతున్న కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వాల కోసం పోటీ పడే నాయకులు పెరుగుతున్నారు. ఇలా ఎక్కువ మంది పోటీపడే పరిస్థితి ఉండడంతో ‘స్థానిక’ అంశం తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు స్థానికత అంశం ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జి.విజయరామారావు, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు స్థానికత అంశంగా అధికార పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోత్ కవిత సొంత ఊర్లు వీరి నియోజకవర్గాల పరిధిలో లేవు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం, సొంత పార్టీల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకులు పోటీగా లేకపోవడంతో వీరికి ఇబ్బంది లేనట్టుగా కనబడుతోంది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నాయకులు చాలా మంది వెళ్లిపోయారు. నాయకుల కొరత కారణంగా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీలుగా ఎక్కువ మంది స్థానికేతరులే ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకతకు తోడు ఇప్పుడు స్థానికేతర అంశం.. జిల్లాలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో మరింత సమస్యగా మారే పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో సొంత నియోజకవర్గం వర్థన్నపేట ఎస్సీ రిజర్వురుగా మారడంతో టీడీపీ ప్రస్తుత తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనరు ఎర్రబెల్లి దయాకర్‌రావు 2009లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు ఎర్రబెల్లి స్థానికుడు కాదనే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. వైఎస్సాఆర్సీపీ జిల్లా కన్వీనరు ముత్తినేని సోమేశ్వరరావు వారం క్రితం స్థానికేతర నాయకులపై చేసిన ప్రకటన ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనగామ, పరకాల నియోజకవర్గ ఇంచార్జీలకు స్థానికేతర అంశం అడ్డంకిగా మారుతోంది. జనగామ టీడీపీ ఇంచార్జీ ఎడబోయిన బస్వారెడ్డి సొంత ఊరు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హన్మకొండ మండలం సోమిడి. పరకాల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ చల్లా ధర్మారెడ్డి సొంత ఊరు భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో ఉంది. వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలోనే ఉన్నా వీరిద్దరూ పొరుగున ఉన్న సెగ్మెంట్లకు ఇంచార్జీలు ఉండడంతో ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులు వీరి స్థానికేతర అంశాన్ని లేవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక వాదంతో పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల సీట్ల కేటాయింపులోనూ స్థానిక నేతలు ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. జనగామ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇన్చార్జ్గా స్థానికేతరుడిని నియమించడంపై అక్కడి గులాబీ శ్రేణులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ ఇంచార్జీగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. ఈయన సొంత ఊరు వర్థన్నపేట మండలం పున్నేలు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 2004లో తెలంగాణ జనతా పార్టీ తరఫున వర్థన్నపేట నియోజకవర్గంలో, 2009లో టీఆర్ఎస్ తరఫున రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌లో పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా దీటుగా ఉండే నాయకులను కాదని ముత్తిరెడ్డిని ఇన్చార్జ్గా నియమించడంపై జనగామ టీఆర్ఎస్లో అసంతృప్తి పెరుగుతోంది. వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జీ ఆరూరి రమేశ్ సొంత ఊరు జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు. ఇది స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్ కూడా ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీలోనే ఉంది. వర్థన్నపేట నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు లేనట్లుగా రమేశ్‌ను ఇన్చార్జ్గా పెట్టడంపై ఇక్కడి పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వర్థన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లోనూ స్థానికుడు కాని జి.విజయరామారావుకు టికెట్ ఇవ్వడం వల్లే మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ గెలవగలిందని టీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.