
సాక్షి, హైదరాబాద్: తాను బీజేపీలోకి వెళ్తున్నానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని టీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని, కేసీఆర్ వెంటే నడుస్తానని ఆయన చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తాను ఉద్యమంలోనూ ఉన్నానని, భవిష్యత్‌లోనూ కేసీఆర్ వెంటే ఉంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment