
చేర్యాల (సిద్దిపేట)/జనగామ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 65వ జన్మదినం సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అవయవదానానికి ముందు కొచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలోని దుర్గామాత సాక్షిగా అవయవదానం చేస్తున్నట్లు సంతకం చేసిన పత్రాలను వైద్యులకు అందజేశారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యస భ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌లు ఇచ్చిన పిలుపు మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరణించిన తర్వాత పనిచేసే అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభాగ్యులకు అందించి నూరేళ్ల ఆయుష్షును అందించాలని విజ్ఞప్తి చేశారు. అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో నడిపించిన సీఎం కేసీఆర్ పాత్ర దేశ రాజకీయాల్లో కీలకం కానుందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని విధాలుగా అర్హులని పేర్కొన్నారు. కేటీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment